హరారే: జింబాబ్వేతో సిరీస్ గెలిచిన భారత్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జింబాబ్వేకు చెందిన ఓ పోలీసు మోటార్ సైకిల్ తీసుకొని, అంతకుముందే మైదానంలో చక్కెర్లు కొట్టాడు. మ్యాచ్‌కు ముందే అతను బైక్ పైన రైడ్ చేశాడు. ధోనీకి బైకులు అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే.
జింబాబ్వే మూడో ట్వంటీ 20 నేపథ్యంలో స్థానిక పోలీస్ బైక్ తీసుకున్నాడు. ధోనీ చక్కర్లు కొట్టిన బైకు మామూలు బైకు కాదు. అక్కడి పోలీసులు వాడే కవాసకీ కాంటోర్స్ 14 ఏబీఎస్ మోడల్‌కు చెందింది. మ్యాచ్‌కు కాస్తంత ముందుగానే మైదానంకు చేరుకున్నాడు.

అక్కడ పార్క్ చేసి ఉన్న ఆ బైకును చూసి ముచ్చటపడ్డాడు. అక్కడికి సమీపంలోనే ఉన్న ఓ పోలీస్‌ను అడిగి తాళం చెవి తీసుకున్నాడు. మైదానంలో రౌండ్లు వేశాడు. దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
హరారేలో తాను నడిపిన బైకు మోడల్ తన వద్ద లేకపోయినా, ఆ బైకు కంపెనీకి చెందిన బైకులు రెండు, మూడు ధోనీ వద్ద ఉన్నాయి. వాటిపై రైడింగ్ అనుభవంతోనే ధోనీ నిన్న రూ.10.50 లక్షల విలువ చేసే ఆ బైకును అతడు అలవోకగా నడిపాడు.