Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జట్టుపై ధుమధుమలాడిన ధోనీ, గ్యాలరీ కోసం ఆడుతున్నారని ఆగ్రహం

Mahendra Singh Dhoni
నాగపూర్: దక్షిణాఫ్రికాపై వరుసగా వికెట్లు పారేసుకున్న క్రికెటర్లపై భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ధుమధుమలాడాడు. తమ జట్టు సభ్యులు దేశం కోసం కాకుండా గ్యాలరీ కోసం ఆడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దక్షిణాఫ్రికాపై 29 పరుగులకు 9 వికెట్లు కోల్పోయి, భారత్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. భారీ షాట్లు కొట్టేప్పుడు దేశం కోసం ఆడుతున్నామనే విషయాన్ని క్రీడాకారులు మరిచిపోయారని ఆయన ఓటమి తర్వాత మీడియా ప్రతినిధులతో అన్నారు. దానివల్ల 40 పరుగులు తక్కువగా వచ్చాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రతి బంతిని బౌండరీ దాటించాలనే కోరికను అణచుకోవడం చాలా అవసరమని, మామాలుగా ఆడి 50 ఓవర్లు పూర్తి చేసి ఉంటే స్కోర్ 325 - 330 దాటి ఉండేదని ఆయన అన్నారు. బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చాలని ప్రయత్నించానని, అది ఫలితం ఇవ్వలేదని ఆయన అన్నారు. డకవుట్ అయిన యూసుఫ్ పఠాన్‌ను ముందుగా బ్యాటింగుకు పంపడాన్ని ఆయన సమర్థించుకున్నారు. యూసుఫ్ పఠాన్ అలాగే ఆడుతాడని, తొందరగా అవుటవుతాడు లేదా భారీ ఇన్నింగ్సు ఆడుతాడని ఆయన అన్నారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+