For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లక్ష్యం మార్పే దెబ్బ తీసింది: ధోనీ

By Staff
M S Dhoni
కాన్ బెర్రా: శ్రీలంకపై వన్డే మ్యాచ్ ఓటమికి వర్షం కారణంగా నిర్దేశించిన సవరించిన లక్ష్యమే కారమని భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నారు. భారత్ నిర్ణీత 29 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. అయితే వర్షం కారణంగా శ్రీలంక ఇన్నింగ్స్ ను 21 ఓవర్లకు కుదించి 154 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి శ్రీలంక సునాయసంగా ఛేదించింది. 196 పరుగుల లక్ష్యాన్ని కాకుండా 154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చినప్పుడు ధోరణే మారిపోతుందని ఆయన అన్నారు.

భారత బౌలింగ్ బాగా లేదని చెప్పలేమని, శ్రీలంక రిస్క్ తీసుకుని విజయం సాధించిందని ఆయన అన్నారు. శ్రీలంక ప్రారంభం బాగుందని ఆయన అన్నారు. శ్రీలంక 50 పరుగులు చేసినప్పుడే తమ ఓటమి ఖాయమైపోయిందని అనుకున్నట్లు ఆయన చెప్పారు. మైదానం తడిగా ఉండడం వల్ల ఫీల్డింగ్ కష్టమైందని ఆయన చెప్పారు. యువరాజ్ విఫలమవుతున్న మాట నిజమేనని, అయితే ఈ రోజు ఆటలో తేడా కనిపించిందని ఆయన అన్నారు. యువకులు తమకు లభించిన అవకాశాన్ని వినియోగించుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
Story first published: Tuesday, February 12, 2008, 16:29 [IST]
Other articles published on Feb 12, 2008
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+