న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోపంతో ఊగిపోయిన ధోని: మ్యాచ్ తర్వాత హత్తు కున్నాడు (వీడియో)

IPL 2019 : MS Dhoni Angry With Deepak Chahar After Two No Balls || Oneindia Telugu
Dhoni bhai smiled and hugged me after the match: Deepak Chahar

హైదరాబాద్: మ్యాచ్ అనంతరం జట్టులోని తన సహచర ఆటగాళ్లు అభినందించారని చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ దీపక్ చాహర్ తెలిపాడు. శనివారం చెపాక్ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆగ్రహంతో ఊగిపోయాడు. ధోనీ కోపాన్ని చూసిన అంపైర్ కూడా ఏం మాట్లాడకుండా వెనక్కి వెళ్లిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 160 పరుగులు చేసింది. అనంతరం 161 పరుగుల లక్ష్య చేధనకు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు విజయానికి ఆఖరి రెండు ఓవర్లలో 39 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసేందుకు బంతిని ధోని పేసర్ దీపక్ చాహర్‌కు ఇచ్చాడు.

డెత్ ఓవర్లలో ఎక్కువ ఒత్తిడి

డెత్ ఓవర్లలో ఎక్కువ ఒత్తిడి

డెత్ ఓవర్లలో ఎక్కువ ఒత్తిడి ఉంటుంది కాబట్టి... ఒత్తిడికి గురైన చాహర్ తొలి రెండు బంతుల్ని నోబాల్స్‌గా విసిరాడు. దీంతో ఓవర్ పడకుండానే 8 పరుగులు పంజాబ్‌ ఖాతాలో చేరాయి. దీంతో మైదానంలో కెప్టెన్ కూల్‌గా పేరొందిన ధోని అసహనంతో కోల్పోయాడు. చాహర్‌పై కోపడ్డాడు. ధోని కోపాన్ని చూసిన చాహర్ ఆ తర్వాత తొలి 5 బంతులకి 1, 1, 1, 1, 1 రూపంలో సింగిల్స్ ఇచ్చాడు.

వరుసగా రెండు నోబాల్స్ వేయడంపై

అదే ఓవర్ ఆఖరి బంతికి పంజాబ్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ డేవిడ్ మిల్లర్ వికెట్ తీయడం తీసి చెన్నైకి విజయాన్ని అందించాడు. ఈ ఘటనపై దీపక్ చాహర్ మాట్లాడుతూ "వరుసగా రెండు నోబాల్స్ వేయడంపై ధోని భాయ్ నాపై కోపంతో ఊగిపోయాడు. నేను పెద్ద తప్పు చేశాను. దీంతో ధోని వద్దకు వచ్చి నాకు మద్దతు నిలిచాడు" అని తెలిపాడు.

ఐదు బంతుల్లో సింగిల్స్ ఇవ్వడంతో

ఐదు బంతుల్లో సింగిల్స్ ఇవ్వడంతో

అయితే, ఆ తర్వాత వేసిన ఐదు బంతుల్లో సింగిల్స్ ఇవ్వడంతో మ్యాచ్ అనంతరం జట్టులోని ఆటగాళ్లు తనను అభినందించారని చెప్పుకొచ్చాడు. "మ్యాచ్ అనంతరం జట్టులోని ప్రతి ఒక్కరూ నన్ను అభినందించారు. డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేశావ్ అని అన్నారు. ధోని భాయ్ కూడా నవ్వుతూ నా వద్దకు వచ్చి హగ్ చేసుకుని 'వెల్‌డన్' అని చెప్పాడు" అని దీపక్ చాహర్ అన్నాడు.

రెండు చెత్త బంతులను వేశానని నాకు తెలుసు

రెండు చెత్త బంతులను వేశానని నాకు తెలుసు

"నేను రెండు చెత్త బంతులను వేశానని నాకు తెలుసు. వెంటనే పుంజుకున్నా. ఈ సీజన్‌లో ధోని నాకు ఎంతో మద్దతుగా నిలుస్తున్నాడు. ఈ సీజన్‌లో చెన్నై విజయాల్లో నా పాత్ర కూడా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉన్నా" అని దీపర్ చాహర్ తెలిపాడు. కాగా, క్రికెట్ నిబంధనల ప్రకారం ఒకే ఓవర్‌లో బౌలర్ రెండు నో బాల్స్ విసిరిన తర్వాత అతడిని బౌలింగ్‌ నుంచి అంపైర్ తప్పిస్తారు.

Story first published: Monday, April 8, 2019, 17:40 [IST]
Other articles published on Apr 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X