Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గౌతం గంభీర్ కు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బాసట

Mahendra Singh Dhoni
హైదరాబాద్: ఫామ్ కోల్పోయి కష్టాల్లో పడిన భారత క్రికెట్ జట్టు ఓపెనర్ గౌతం గంభీర్ కు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బాసటగా నిలిచాడు. ఫామ్ కోసం గంభీర్ కష్టపడుతున్నాడని, గంభీర్ మంచి ఆటగాడని, ఈ మ్యాచులో బాగా ఆడగలడని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. ఫామ్ కోల్పోవడం ప్రతి ఆటగాడి విషయంలో జరుగుతుందని, గంభీర్ పై అంచనాలు చాలా ఎక్కువగా పెట్టుకున్నారని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. గంభీర్ తన సత్తా చాటుకున్నాడని, అందువల్ల మురళీ విజయ్ నిరీక్షించక తప్పదని ఆయన అన్నారు. అవకాశం వచ్చినప్పుడు మురళీ విజయ్ తన సత్తాను చాటుకున్నాడని, అయితే ఓపెనర్ స్లాట్ కు ఇప్పుటికిప్పుడయితే గంభీర్ ఉత్తమ ఆటగాడని ఆయన అన్నారు.

ఇటీవల విఫలమవుతూ వస్తున్న సురేష్ రైనాకు కూడా ధోనీ మద్దతుగా నిలిచారు. ఒక్క మ్యాచ్ ద్వారా ఓ క్రీడాకారుడి ఆటతీరును అంచనా వేయలేమని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరికీ అవకాశం ఇవ్వాలని, బయట కూర్చుని వ్యాఖ్యలు చేయడం సులభమని, క్రీడాకారుల చెప్పుల్లో కాలు పెడితే వాస్తవం అర్థమవుతుందని ఆయన అన్నారు.

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇది మంచి మైదానమని ఆయన అన్నారు. బౌలర్లకూ బ్యాట్స్ మన్ కూ ఇది సహకరిస్తుందని ఆయన అన్నారు. ఈ మైదానంలో తాము క్రికెట్ ఆడామని ఆయన చెప్పారు. న్యూజిలాండ్ కు, భారత్ కు మధ్య శుక్రవారం రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+