Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సైడ్ స్పిన్.. నూర్ గాడి సక్సెస్ మంత్ర- దెబ్బకు లైన్ లో.. !!

ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరో అద్భుత విజయాన్ని అందుకుంది. మంగళవారం రాత్రి చెన్నై చెపాక్ స్టేడియంలో కోల్ కత నైట్ రైడర్స్ ను మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన ఈ ఎల్లో ఆర్మీ నిర్ణీత 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేయగా.. కోల్ కత దాన్ని అందుకోలేకపోయింది. 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 160 పరుగుల వద్దే నిలిచిపోయింది. 32 పరుగుల తేడాతో పరాజయాన్ని చవి చూసింది.

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూల్చడంలో కీలక పాత్ర పోషించాడు నూర్ అహ్మద్. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నారు. ఈ విజయం వెనుక మహేంద్ర సింగ్ ధోనీ వ్యూహాత్మక మార్గదర్శనం కీలకమని తేలింది. ఈ సీజన్ లో నూర్ అహ్మద్ పెద్దగా రాణించట్లేదు. పేలవమైన ఫామ్‌లో ఉన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. బెంచ్ కే పరిమితమౌతాడనుకున్న దశలో గాడిన పడ్డాడు.

Dhoni-Backed Noor Ahmad Shines with 3-21 Clinching IPL 2026 Performance for CSK vs KKR in Chennai

కేకేఆర్ పై నాలుగు ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి ఏకంగా మూడు వికెట్లు పడగొట్టి అద్భుత పునరాగమనం చేశాడు. సునీల్ నరైన్, అజింక్య రహానె, కామెరాన్ గ్రీన్ వికెట్లు అతని ఖాతాలో పడ్డాయి. టాప్ టు మిడిలార్డర్ వికెట్లను కుప్పకూల్చగలిగాడు నూర్ అహ్మద్. అతని దెబ్బకు కోల్ కత నైట్ రైడర్స్ బ్యాటింగ్ ఆర్డర్ వెన్నెముక విరిగినట్టయింది. కామెరాన్ గ్రీన్ వికెట్ హైలైట్ గా చెప్పుకోవచ్చు. గోల్డెన్ డకౌట్ అయ్యాడు గ్రీన్.

అతని సక్సెస్ పై బౌలింగ్ అసిస్టెంట్ కోచ్ శ్రీధరన్ శ్రీరామ్ మాట్లాడారు. నూర్ పునరాగమనంలో ధోనీ కీలక పాత్ర వహించాడని తెలిపారు. ప్రాక్టీస్ సెషన్‌లో నూర్‌తో ధోనీ చాలా సేపు మాట్లాడాడని, గుగ్లీలకు బదులు లెగ్ బ్రేక్‌ బౌలింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించాడు. కోల్ కత నైట్ రైడర్స్ బ్యాటర్లు లెగ్ బ్రేక్ బంతులకు తడబడతారని సూచించాడు. దీని తర్వాత నూర్ అహ్మద్ లెగ్ బ్రేక్ బంతులపై నెట్ సెషన్ లో సుదీర్ఘంగా ప్రాక్టీస్ చేశాడు. సక్సెస్ అయ్యాడు.

గత సీజన్‌లో 24 వికెట్లు తీసిన నూర్.. ఈసారి రిథమ్ కోల్పోయాడు. పేలవ ఫామ్‌తో ఆఫ్ఘనిస్తాన్ టీ20 ప్రపంచ కప్ జట్టులో కూడా అతనికి చోటు దక్కలేదు. లైన్ అండ్ లెంగ్త్, ఫ్లాట్ బౌలింగ్ ఈ సీజన్‌లో అతనికి ప్రధాన సమస్యలుగా మారాయి. ధోనీ సలహా మేరకు ఈ మ్యాచ్‌లో నూర్ వ్యూహం మార్చాడు. బంతి వేగాన్ని తగ్గించాడు. ఎక్కువ సైడ్ స్పిన్ తో పిచ్‌పై డ్రాప్ అయ్యేలా బంతులను సంధించాడు. దీంతో బ్యాటర్లకు షాట్లు ఆడటం కష్టమైంది.

Story first published: Wednesday, April 15, 2026, 12:45 [IST]
Other articles published on Apr 15, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+