Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

200: రెండో వన్డేలో సరికొత్త రికార్డు సృష్టించిన ధోని

హైదరాబాద్: కటక్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని సరికొత్త రికార్డు సృష్టించాడు. కటక్ వన్డేలో 200 సిక్సర్లు బాదిన భారత క్రికెటర్‌గా ధోని అరుదైన గుర్తింపు పొందాడు. వన్డేల్లో భారత్ తరుపున అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా ఇప్పటికే కొనసాగుతున్న ధోని తన రికార్డును మరింతగా మెరుగుపరుచుకున్నాడు.

రెండో వన్డేలో ధోని 200 సిక్సర్లు మైలురాయిని అందుకున్నాడు. 48 ఓవర్లో ప్లంకెట్‌ను ధోని మూడు సిక్సర్లు కొట్టడంతో ఈ ఘనతను సాధించాడు. ఈ వన్డేలో ధోని తన కెరీర్‌లో పదో సెంచరీ సాధించాడు. 122 బంతుల్లో 6 సిక్సర్లు, 10 ఫోర్ల సాయంతో ధోని 134 పరుగులు సాధించాడు.

స్వదేశంలో నాలుగువేల పరుగుల మైలురాయిని ధోని అందుకున్నాడు. తద్వారా భారత్‌ తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా ధోనీ నిలిచాడు. 110 వన్డేలతో ధోని ఈ ఘనతను సాధించాడు. ఇదిలా ఉంటే స్వదేశంలో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో 6,976పరుగులతో సచిన్ అగ్రస్థానంలో ఉన్నాడు.

సచిన్ తర్వాత నాలుగు వేల పరుగులు చేసిన ధోని రెండో స్ధానంలో ఉండగా, టీమిండియా మాజీ క్రికెటర్‌ రాహుల్‌ ద్రావిడ్‌ 3,406పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు.

వన్డేల్లో అత్యధిక సిక్సర్లు సాధించిన ఆటగాళ్లు:

షాహిద్‌ ఆఫ్రిది- 350
సనత్ జయసూర్య-270
క్రిస్ గేల్- 238
ఎంఎస్ ధోని -203
బ్రెండన్ మెక్ కల్లమ్-200
సచిన్ టెండూల్కర్ -195
సౌరభ్ గంగూలీ-190

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+