ముంబై: వచ్చే ఏడాది భారత్ వేదికగా తొలిసారి జరగనున్న ఐసీసీ వరల్డ్ టీ20 ట్రోఫీని ముంబైలో శుక్రవారం ఆవిష్కరించారు. టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు ఆటగాళ్లు శిఖర్ ధావన్, అజింక్యా రహానేలు వరల్డ్ కప్ ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వరల్డ్ టీ20 షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించిన అనంతరం ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మార్చి 11 నుంచి ఏప్రిల్ 3 వరకు ఈ టోర్నీని నిర్వహించనున్నారు. ఢిల్లీ, ముంబైలలో సెమీఫైనల్స్ నిర్వహిస్తుండగా, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఫైనల్ మ్యాచ్‌ని నిర్వహించనున్నారు.
న్యూజిలాండ్‌తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడతుండగా, పాకిస్థాన్-భారత్‌ల మధ్య మ్యాచ్ మార్చి 19న ధర్మశాలలో జరుగనుంది. భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు ఒకే గ్రూపులో ఉండగా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, శ్రీలంక మరో గ్రూపులో ఉన్నాయి.

వరల్డ్ టీ20 2016 గ్రూపులు, పూర్తి షెడ్యూల్:
తొలి రౌండ్ (group winners to progress to second round - Super 10)
గ్రూప్ A - బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, ఐర్లాండ్, ఓమన్
గ్రూప్ B - జింబాబ్వే, స్కాట్లాండ్, హాంకాంగ్, ఆప్ఘనిస్తాన్
సెకండ్ రౌండ్ (Super 10) - Top 2 from each group go to semi-finals
గ్రూప్ 1 - Sri Lanka, South Africa, West Indies, England and winner group B (Q1 B)
గ్రూప్ 2 - India, Pakistan, Australia, New Zealand and winner group A (Q1 A)
టోర్నమెంట్ షెడ్యూల్ (8 March to 3 April)
35 మ్యాచ్‌లు 7 వేదికలలో (బెంగుళూరు, ధర్మశాల, కోల్‌కత్తా, మొహాలీ, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ)
Friday, 1 April - Rest/travel day
Saturday, 2 April - Rest/travel day
Sunday, 3 April - Final (Eve.), Kolkata
Past winners of World T20
2007 - India beat Pakistan by 5 runs in final (Hosts South Africa)
2009 - Pakistan beat Sri Lanka by 8 wickets in final (England)
2010 - England beat Australia by 7 wickets in final (West Indies)
2012 - West Indies beat Sri Lanka by 36 runs in final (Sri Lanka)
2014 - Sri Lanka beat India by 6 wickets in final (Bangladesh)
తెలుగు వన్ఇండియా