మెల్బోర్న్: ప్రపంచ కప్‌లో భాగంగా క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. మహ్మద్ షమీ వేసిన 17వ ఓవర్లో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ మహ్మదుల్లా (21) భారీ షాట్ ఆడాడు. ఫోర్ లైన్ దగ్గర ఉన్న ధావన్ గాల్లోకి ఎగిరి క్యాచ్ పట్టుకునేందుకు ప్రయత్నించాడు.
అయితే బంతి చేతిలో నుండి జారడంతో రెండో ప్రయత్నంలో అందుకున్నాడు. బ్యాలెన్స్ కోల్పోయిన ధావన్ బౌండరీ లైన్‌ను తాకి అవతలకు వెళ్లాడు. ధావన్ వెంటనే బంతిని గాల్లోకి ఎగరేసి మళ్లీ మైదానంలోకి వచ్చి క్యాచ్ పట్టాడు. థర్డ్ ఎంపైర్ మహ్మదుల్లా అవుటైనట్లు ప్రకటించాడు. దీంతో బంగ్లాదేశ్ 73 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.

ధోనీ మరో రికార్డ్
బంగ్లాదేశ్‌తో మ్యాచ్ గెలవడం ద్వారా భారత జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ తన ఖాతాలో మరో రికార్డ్ వేసుకున్నాడు. ధోనీ ఈ గెలుపు ద్వారా వందో విజయం అందించిన కెప్టెన్‌గా రికార్డ్ సృష్టించాడు. వన్డే సారథిగా ధోనీకి ఇది సెంచరీ గెలుపు. వన్డేల్లో ఈ ఘనత సాధించిన సారథుల్లో ధోనీ మూడోవాడు.
ఆస్ట్రేలియా మాజీలు రికా పాంటింగ్, అలెన్ బోర్డర్‌లు ఈ లిస్టులో ఉన్నారు. భారత్ విషయానికి వస్తే మహ్మద్ అజహరుద్దీన్ 174 మ్యాచుల్లో 90 విజయాలు అందించాడు.
మరోవైపు, ధోని సేనకు ప్రపంచ కప్‌లో వరుసగా ఇది పదకొండో విజయం. ఈ ప్రపంచ కప్‌లో వరుసగా ఇది ఏడో విజయం. ధోనీ భారత వన్డే సారథిగా 2007 నుండి కొనసాగుతున్నాడు. ధోనీ సారథ్యంలో భారత్.. ట్వంటీ 20 ప్రపంచ ఛాంపియన్ షిప్ (2007), ప్రపంచ కప్ (2011), ఛాంపియన్స్ ట్రోఫీ (2013) గెలుచుకుంది.

వన్డేల్లో టాప్ 5 సారథులు
230 మ్యాచ్‌లలో 165 గెలుపు (51 ఓటమి) - రికీ పాంటింగ్ - (ఆస్ట్రేలియా) - గెలుపు శాతం - 76%
178 మ్యాచ్‌లలో 107 గెలుపు (67 ఓటమి) - అలెన్ బోర్డర్ - (ఆస్ట్రేలియా) - గెలుపు శాతం 61%
177 మ్యాచ్‌లలో 100 గెలుపు (62 ఓటమి) - ఎమ్మెస్ ధోనీ (భారత్) - గెలుపు శాతం 60%
138 మ్యాచ్‌లలో 99 గెలుపు (35 ఓటమి) - హాన్సీ క్రోనే (సౌతాఫ్రికా) - గెలుపు శాతం 73%
128 మ్యాచ్‌లలో 98 గెలుపు (106 ఓటమి) - స్టీఫెన్ ఫ్లెమ్మింగ్ (న్యూజిలాండ్) - గెలుపు శాతం 48%