శిఖరపు రికార్డులకు చేరువలో శిఖర్ ధావన్.. ఇంకొన్ని పరుగులు చేస్తే చాలు

ముంబైలోని వాంఖడే స్టేడియంలో సోమవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ఇప్పటికే 7మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ పాయింట్ల పట్టికలో చివరి నుంచి 3వ స్థానంలో ఉంది. 3మ్యాచ్‌లు గెలిచిన పంజాబ్ 6పాయింట్లతో 8వ స్థానంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో ఐపీఎల్ లీగ్ దశలో సెకండాఫ్‌ను విజయంతో ప్రారంభించాలని పంజాబ్ చూస్తోంది.

ధావన్‌కు ఇది 200వ మ్యాచ్
పంజాబ్ స్టార్ ప్లేయర్, టీమిండియా బ్యాటర్ శిఖర్ ధావన్ ఈ మ్యాచ్ ద్వారా పలు రికార్డులను అందుకునే వీలుంది. ఇందులో ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన అద్భుతమైన ఫీట్‌ను కూడా అధిగమించే అవకాశముంది. చెన్నైతో జరిగే మ్యాచ్ ఐపీఎల్‌లో ధావన్‌కి 200వ మ్యాచ్. ఎంఎస్ ధోని (227), దినేష్ కార్తీక్ (221), రోహిత్ శర్మ (220), కోహ్లీ (215), రవీంద్ర జడేజా (207), సురేశ్ రైనా (205), రాబిన్ ఉతప్ప (200)తర్వాత ఈ మైలురాయిని చేరుకున్న ఎనిమిదో క్రికెటర్‌గా ధావన్ నిలవనున్నాడు.

ఆ రికార్డుకు 2 పరుగుల దూరంలో..
టోర్నీలో ఇప్పటివరకు 199మ్యాచ్‌లు ఆడిన ధావన్ రెండు సెంచరీలు, 45హాఫ్ సెంచరీలతో 34.67సగటుతో 5,998పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో 6,000పరుగుల మైలురాయిని చేరుకోవడానికి అతను కేవలం 2పరుగుల దూరంలో ఉన్నాడు. తన కెరీర్‌లో 6402పరుగులు చేసిన కోహ్లీ తర్వాత టోర్నీ చరిత్రలో ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్‌గా నిలవనున్నాడు.

9పరుగులు చేస్తే కోహ్లీ రికార్డ్ ఖతం
ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్‌పై 27మ్యాచ్‌లు ఆడిన ధావన్ 941పరుగులు చేశాడు. అలాగే ఒక సెంచరీతో పాటు ఏడు హాఫ్ సెంచరీలు చెన్నైపై సాధించాడు. ధావన్ చెన్నైపై ఇంకో తొమ్మిది పరుగులు చేస్తే అతను సీఎస్కేపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీని అధిగమిస్తాడు. కోహ్లీ ప్రస్తుతం చెన్నైపై 28మ్యాచ్‌లలో 949పరుగులు చేశాడు. అలాగే ఇంకో 59పరుగులు చేస్తే.. ఐపీఎల్ చరిత్రలో ఒకే జట్టుపై 1000పరుగులు చేసిన మూడో బ్యాటర్‌గా నిలుస్తాడు. ఈ రికార్డును ఇంతకుముందు కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 1018పరుగులు చేసిన రోహిత్, పంజాబ్‌పై 1005పరుగులు చేసిన డేవిడ్ వార్నర్ అందుకున్నారు.

కేవలం 11పరుగులు చేస్తే..
టీ20 క్రికెట్‌లో 9000 పరుగుల మైలురాయిని చేరుకోవడానికి ధావన్ కేవలం 11పరుగుల దూరంలో ఉన్నాడు. 11పరుగులు చేస్తే టీ20 క్రికెట్లో కోహ్లీ (10392 పరుగులు), రోహిత్ (10009 పరుగులు) తర్వాత ఈ ఘనత సాధించిన మూడో భారత బ్యాటర్‌గా నిలుస్తాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన 11వ బ్యాటర్‌గా నిలుస్తాడు. ధావన్ తొమ్మిది వివిధ జట్ల కోసం 310 టీ20మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 8989పరుగులు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications