For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ వేలం 2018: సన్ రైజర్స్ హైదరాబాద్‌కు రూ. 11కోట్లతో మనీశ్ పాండే

hyderabad sunrisers

హైదరాబాద్: ఐపీఎల్ 2018 వేలం ప్రారంభమైంది. బెంగళూరులోని ఐటీసీ గార్డెనియా వేదికగా ఈ వేలం ప్రారంభమైంది. వేలంలో వెయ్యికి పైగా ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నప్పటికీ బీసీసీఐ మాత్రం 578 ప్లేయర్లకు మాత్రమే అనుమతినిచ్చింది. ప్రపంచంలోనే క్యాష్ రిచ్ లీగ్ టోర్నీగా పేరుగాంచిన ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకునేందుకు ఎనిమిది ఫ్రాంఛైజీలు అత్యుత్తమ జట్టుని తయారు చేసుకునేందుకు గాను వేలం ప్రక్రియ ఎంతో ముఖ్యం.

ఐపీఎల్ వేలానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఐపీఎల్ వేలంలో మొట్ట మొదటి ఆటగాడిగా ధావన్ కొనుగోలు అయ్యాడు. అతను 5.2 కోట్ల రూపాయలకు సన్ రైజర్స్ హైదరాబాద్‌కు దక్కాడు.


1. ప్రారంభ ధరను 2 కోట్లుగా ప్రకటించిన ధావన్ అనుకున్న దానికంటే ఎక్కువకే అమ్ముడుపోయాడు. జనవరి 27వ తేదీన మొదలైన ఈ వేలం రెండు రోజుల పాటు జరగనుంది. మొత్తం ఎనిమిది జట్లు ఈ వేలం ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి ఆరాటపడుతున్నాయి.


2. బంగ్లాదేశ్ ఆటగాడైన షకీబ్ అల్ హసన్ వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు రూ. 2 కోట్లకు అమ్ముడుపోయాడు.


3. కేన్ విలియమ్స్ ఇప్పటి వరకు హైదరాబాద్ జట్టు కొనుగోలు చేసిన వాళ్లలో మూడో వాడిగా నిలిచాడు. అతని ధర 3 కోట్లకు అమ్ముడుపోయాడు.


4. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అత్యధిక ధర వెచ్చించి మనీశ్ పాండ్యాను కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు రూ. 5.20 కోట్లతో వేలంలో అధిక ధర పలికిన ధావన్ కంటే కాస్ట్లీ ప్లేయర్‌గా జట్టులోకి చేరాడు.


5. జట్టు తరపున స్వల్ప ధరకు దక్కిన మొట్ట మొదటి ప్లేయర్ యూసఫ్ పఠాన్. అతనిని రూ. 1.9 కోట్లకు కొనుగోలు చేసింది.


6. సన్ రైజర్స్ టీం భారత జట్టు కీపర్ సాహాను 5 కోట్లకు కొనుగోలు చేసింది. ప్రారంభ ధరను 2 కోట్లుగా ప్రకటించిన సాహా ఇంత ఎక్కువ ధరకు అమ్ముడుపోవడం విశేషం.


7. అఫ్గనిస్థాన్ ఆటగాడైన రషీద్‌ను ఎంపిక చేసుకోవడానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓ చిన్నపాటి యుద్ధమే చేసింది. పంజాబ్, ఢిల్లీ, బెంగుళూరు జట్ల నుంచి గట్టి పోటీ ఎదుర్కొని రూ. 9 కోట్లకు సొంతం చేసుకుంది. గతేడాది 4 కోట్లకు ఇదే జట్టు తీసుకోగా ఈ ఏడాది అతని ప్రారంభ ధరను 2 కోట్లుగా ప్రకటించాడు. ఆర్‌టీ‌ఎమ్ ద్వారా హైదరాబాద్ జట్టు అతన్ని సొంతం చేసుకోవడం అప్గాన్ క్రికెట్‌లో ఓ చరిత్రే.


8.

అన్ క్యాప్‌డ్ ప్లేయర్ల నుంచి ఎనిమిదో ఆటగాడిగా రిక్కీ బుయ్‌ను జట్టు కొనుగోలు చేసింది. అతని ప్రారంభ ధర 20 లక్షలకే అతనిని దక్కించుకుంది.


9. కేరళ ఆటగాడైన బసిల్ థంపీను సన్ రైజర్స్ 95 లక్షలుకే కొనుగోలు చేసింది. గతేడాది గుజరాత్ లయన్స్ తరపున ఆడాడు.


10. 26 ఏళ్ల తంగరసు నటరాజన్ 35 లక్షలకు హైదరాబాద్ జట్టు కొనుగోలు చేసింది. ఇంతకుముందు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ఆడాడు.


11. రూ. 3.80 కోట్లకు అమ్ముడుపోయిన సిద్దార్థ్ కౌల్


12. రూ. 3 కోట్లకు కొనుగోలు అయిన సయ్యద్ ఖలీల్ అహ్మద్


శిఖర్ ధావన్ (రూ. 5.20 కోట్లు)

షకీబ్ అల్ హసన్ (రూ. 2 కోట్లు)

కేన్ విలియమ్స్ (రూ. 3 కోట్లు)

మనీశ్ పాండే (రూ. 11 కోట్లు)

యూసఫ్ పఠాన్ (రూ. 1.9 కోట్లు)

వృద్ధిమాన్ సాహా (రూ. 5 కోట్లు)

రషీద్ ఖాన్ (రూ. 9 కోట్లు)

రిక్కీ బుయ్ (రూ. 20 లక్షలు)

బసిల్ థంపీ (రూ. 95 లక్షలు)

టి. నటరాజన్ (రూ. 40 లక్షలు)

సిద్దార్థ్ కౌల్ (రూ. 3.8 కోట్లు)

సయ్యద్ ఖలీల్ అహ్మద్ (రూ. 3.0 కోట్లు)

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, January 27, 2018, 18:10 [IST]
Other articles published on Jan 27, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+