For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భర్త వేధింపులు- చాహల్‌తో విడాకులు తర్వాత వీడియో రిలీజ్ చేసిన ధనశ్రీ!!

గత కొద్ది రోజులుగా టీమిండియా క్రికెటర్ చాహాల్ - డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ధనశ్రీ.. నిత్యం వార్తల్లో నిలుస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరు విడాకులు తీసుకుని మరింత చర్చనీయాంశంగా మారారు. ఈ క్రమంలోనే విడాకులు తీసుకున్న ధన శ్రీ.. రెండు రోజులు కూడా అవ్వకుండానే.. భర్తను తనను ఎంతగా వేధింపులకు గురి చేశాడో తెలుపుతూ ఓ వీడియోను విడుదల చేసింది! కానీ ఇందులో ఓ ట్విస్ట్ ఉంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే?
ధనశ్రీ.. డ్యాన్స్ కొరియోగ్రాఫర్ అన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలోనూ తన డ్యాన్స్ వీడియోలతో అలరిస్తుంటుంది. మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా చేస్తోంది. తాజాగా ఆమె దేఖా జి దేఖా మెనే అనే ఆల్బమ్ ను విడుదల చేసింది. ఈ వీడియోలో భర్త, భార్యను చిత్రహింసలకు గురిచేస్తున్నట్టుగా చూపించారు. ఇంకా స్నేహితుడి ముందే భార్యను భర్త కొడుతున్నట్లుగా, భార్య ముందే మరో మహిళతో భర్త శృంగారంలో పాల్గొన్నట్లుగా వంటి సన్నివేశాలను చూపించారు. అలానే ఈ వీడియోలో ధనశ్రీ ఏడుస్తూ తన బాధను వ్యక్తం చేసిన మహిళా బాధితురాలిగా కనిపించింది. రాజస్థాన్ బ్యాక్‌డ్రాప్‌లో వీడియోనూ చిత్రీకరించారు. ఈ లిరిక్స్ ను జాని రాయగా.. జ్యోతి నూర్ ఆలపించారు.

Dhanashree verma shares husband domestic violence Music album video after divorce with chahal

ముందు అది చూడండి..
అయితే ఈ వీడియో ఆల్బమ్ ను విడుదల చేయగా.. ధనశ్రీని మీడియా ప్రతినిధులు పలు ప్రశ్నలతో చుట్టుముట్టారు. డివోర్స్ సంబంధించిన ప్రశ్నలను అడిగారు. కానీ ధనశ్రీ వాటిని దాటవేస్తూ.. ముందు సాంగ్ చూడండి అంటూ పేర్కొంది.

Story first published: Saturday, March 22, 2025, 18:32 [IST]
Other articles published on Mar 22, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+