Dhanashree Verma: సహనం కోల్పోయిన ధనశ్రీ.. రోడ్డుపై ఏం చేసిందంటే?
Dhanashree Verma Chahal Divorce: టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ - ధనశ్రీ వర్మ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జంట దాఖలు చేసిన డివోర్స్ పిటిషన్‌ను బాంద్రాలోని కుటుంబ న్యాయస్థానం ఆమోదించింది. అయితే ఈ డివోర్స్ నేపథ్యంలో ధనశ్రీకి సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. సహనం కోల్పోయిన ఆమె రోడ్డుపైనే ఏం చేసిందో వీడియోలో కనిపిస్తోంది.
అసలేం జరిగిందంటే?
చాహల్, ధనశ్రీ 2020 డిసెంబరులో పెళ్లి చేసుకున్నారు. కానీ విభేదాల కారణంగా 2022 జూన్ నుంచి విడివిడిగా ఉంటున్నారు. అలా ఈ ఏడాది ఫిబ్రవరి 5న ఈ జంట విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం వీరి పటిషన్ ను పరిశీలించిన న్యాయస్థానం తాజాగా వీరికి విడాకులను మంజూరు చేసింది. అలానే కోర్టు ఆదేశాల మేరకు చాహల్.. ధనశ్రీకి రూ.4.75 కోట్ల భరణం అందజేయనున్నట్లు తెలిసింది.
అయితే బాంద్రా కోర్టు విడాకులు మంజూరు చేయకముందు.. న్యాయస్థానానికి చాహల్.. Be your own sugar daddy (ఆర్థికంగా లేదా ఇతరపరంగా ఎవరిపై ఆధారపడకుండా ఉండాలి) అనే క్యాప్షన్ రాసి ఉన్న టీషర్ట్ ధరించి వచ్చాడు. ధనశ్రీ వైట్ టీషర్టు, బ్లూ జీన్స్ తో పాటు బ్లాక్ ఫేస్ మాస్క్ ధరించి వచ్చింది. అప్పుడే ధనశ్రీని మీడియా ప్రతినిధులు, కెమెరామెన్స్..చుట్టుముట్టారు. ఈ క్రమంలోనే ఓ మహిళా.. ఈ గుంపు కారణంగా కాస్త కింద పడిపోయింది. దీంతో వెంటనే ధనశ్రీ.. సహనం కోల్పోయి అక్కడి వాళ్లపై మండిపడింది. 'ఏం చేస్తున్నారు, ఇదే నా మీ పద్ధతి?' అంటూ ఆగ్రహానికి గురైంది. ఇప్పుడీ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ధనశ్రీ వర్మపైనే మండిపడుతున్నారు. 'ఇంట్లో కూర్చొని రూ.4-5కోట్లు (చాహల్ నుంచి భరణం) కొట్టేసింది', 'నీ పద్ధతి కంటే బాగుంది', 'ఇలాంటి వ్యక్తుల పట్ల అటెన్షన్ ఇవ్వకుండా, ఇతర విషయాలపై మీడియా ఫోస్ చేస్తే బాగుంటుంది' అంటూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications