Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

"ఆ రోజు అందరి ముందు ఏడ్చేశాను": విడాకులపై తొలిసారి మాట్లాడిన ధనశ్రీ

యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మల విడాకులు 2025లో ఎక్కువగా చర్చనీయాంశమైన సంఘటనల్లో ఒకటి. వీరిద్దరి విడాకులు జరిగి చాలా నెలలు అయ్యాయి. విడాకుల తర్వాత ఇద్దరూ తమ తమ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే కోర్టు విచారణ సమయంలో యుజ్వేంద్ర చాహల్ ధరించిన ఒక టీ-షర్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. దానిపై "Be Your Own Sugar Daddy" అని రాసి ఉంది. ఇది ధనశ్రీకి తన చివరి సందేశమని చాహల్ ఆ తర్వాత వివరించాడు. ఇప్పుడు ఈ సంఘటనపై ధనశ్రీ వర్మ కూడా స్పందించారు. ఆ రోజు ఆమెకు ఎంత భావోద్వేగంతో కూడినదో వివరించారు.

విడాకులపై ధనశ్రీ వర్మ మనసులోని మాట
యజువేంద్ర చాహల్ మాజీ భార్య,డ్యాన్సర్, కంటెంట్ క్రియేటర్ అయిన ధనశ్రీ వర్మ మొదటిసారిగా హ్యూమన్స్ ఆఫ్ బాంబే షోలో కనిపించారు. ఈ సందర్భంగా తన జీవితంలోని అనేక విషయాలపై ఆమె నిక్కచ్చిగా మాట్లాడారు. తన పెళ్లి మరియు విడాకులు తన వ్యక్తిత్వాన్ని ఏ విధంగా ప్రభావితం చేశాయో ఆమె వివరించారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్, పుకార్లు, మరియు అసంఖ్యాకమైన ఊహాగానాలను ఎదుర్కొన్న తర్వాత కూడా ఆమె ధైర్యం కోల్పోకుండా, మళ్లీ తనను తాను నిలబెట్టుకున్నారని తెలిపారు.

Dhanashree Verma Breaks Silence on Divorce with Yuzvendra Chahal I Cried in Court

కోర్టులో విడాకుల ప్రక్రియ చివరి రోజు గురించి ధనశ్రీ మాట్లాడుతూ.. "విడాకుల తీర్పును వెలువరిస్తున్నప్పుడు నేను చాలా భావోద్వేగానికి గురయ్యాను. అందరి ముందు నేను గట్టిగా ఏడ్వడం మొదలుపెట్టాను. నాకు గుర్తు ఉన్నదల్లా, నేను అరుస్తూ, ఏడుస్తూ ఉన్నాను. ఇదంతా నిజంగానే జరిగింది. ఆ తర్వాత అతడు (చాహల్) ముందుగానే బయటకు వెళ్లిపోయాడు" అని ఆమె అన్నారు.ఈ సంభాషణలో ధనశ్రీ తన వ్యక్తిగత జీవితం ఒక జాతీయ వార్తగా మారినప్పుడు ఎలా అనిపించిందో, ప్రజల తీర్పులు, వైరల్ వివాదాల వెనుక ఉన్న నిజాలను పంచుకున్నారు. విడాకుల తర్వాత ప్రేమ, బాధ, వాటి నుంచి కోలుకునే ప్రయాణం గురించి కూడా మాట్లాడారు. దంత వైద్యురాలి నుంచి డ్యాన్సర్, క్రియేటర్‌గా మారిన తన ప్రయాణాన్ని కూడా ఆమె వివరించారు.

చాహల్ టీషర్టుపై ధనశ్రీ స్పందన
యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడిపోవడం 2025లో చర్చకు వచ్చిన అంశాల్లో ఒకటి. కానీ కోర్టు విచారణ సమయంలో చాహల్ ధరించిన "Be Your Own Sugar Daddy" అని రాసి ఉన్న టీ-షర్ట్ బాగా వైరల్ అయింది. అది ధనశ్రీకి తన చివరి సందేశమని చాహల్ చెప్పిన తర్వాత ఈ విషయం మరింత ప్రాచుర్యం పొందింది. ఈ సంఘటనపై స్పందించిన ధనశ్రీ.. ఆ రోజు తన మనసులో రేగిన అలజడిని గుర్తుచేసుకున్నారు.యుజ్వేంద్ర చాహల్ టీ-షర్ట్ గురించి తెలుసుకుని తాను షాక్ అయ్యానని ఆమె అంగీకరించారు. ఈ వివాదానికి ముందు నుంచే విడాకులకు ప్రజలు తననే నిందిస్తారని తనకు తెలుసని ఆమె అన్నారు. చాహల్ వివరణకు స్పందిస్తూ, "అరే భాయ్, వాట్సాప్ చేసేస్తే సరిపోయేది కదా! టీ-షర్ట్ డ్రామా ఎందుకు?" అని చాహల్‌కు కౌంటర్ ఇచ్చారు. ఆ క్షణంలో ఆమె కుంగిపోకుండా, తన జీవితంలో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.

సమాజంలో మహిళలపై ఉండే ఒత్తిళ్ల గురించి మాట్లాడుతూ, రాజీ పడి ఏదైనా చేసి పెళ్లిని నిలబెట్టుకోవాలని వారికి తరచుగా బోధిస్తారని ధనశ్రీ చెప్పారు. కోర్టు విచారణ సమయంలో తన జీవిత భాగస్వామికి ఎల్లప్పుడూ అండగా నిలిచిన వ్యక్తిగా, తన భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయానని ఆమె తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి ప్రవర్తనే అతని నిజమైన వ్యక్తిత్వాన్ని చూపిస్తుందని ఆమె అన్నారు. చాహల్ తన టీ-షర్ట్ ఒక సందేశం అని చెప్పినా, విడాకుల సమయంలో కూడా గౌరవం, మర్యాదలు పాటించడం చాలా ముఖ్యమని ధనశ్రీ స్పష్టం చేశారు. అనవసరమైన డ్రామాలకు దూరంగా ఉండి, పరిణతితో వ్యవహరించడానికి తాను ఇష్టపడతానని ఆమె అన్నారు.

విడాకులు తీసుకోవడం ఎంత సులభం?
విడాకులు ఎప్పుడూ సులభం కాదని, వాటిని ఒక పండగలా జరుపుకోకూడదని ధనశ్రీ చెప్పారు. తాను ఎల్లప్పుడూ పరిణతితో వ్యవహరించాలని నిర్ణయించుకున్నానని, ప్రజలకు నచ్చినట్లుగా మాట్లాడి కుటుంబ విలువలను దెబ్బతీయడం తనకు ఇష్టం లేదని అన్నారు. "నా కుటుంబం లేదా వారి కుటుంబం విలువలకు నేను భంగం కలిగించదలచుకోలేదు, మనం మర్యాదను నిలుపుకోవాలి" అని ఆమె అన్నారు. బాధ , దుఃఖాన్ని అంగీకరించడం అవసరమే కానీ, విడిపోవడం ఒకరిని అవమానించడానికి సాకుగా మారకూడదని ఆమె పేర్కొన్నారు.ధనశ్రీ వర్మ, యుజ్వేంద్ర చాహల్ 2020లో పెళ్లి చేసుకున్నారు. 2025లో అధికారికంగా విడిపోవాలని నిర్ణయించుకున్నారు.

Story first published: Wednesday, August 20, 2025, 10:43 [IST]
Other articles published on Aug 20, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+