Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'నాకేం అవసరం లేదు!' - చాహల్ తో విడాకులపై ధనశ్రీ షాకింగ్ పోస్ట్

టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ ధనశ్రీ వర్మ విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొంత కాలంగా ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా ధనశ్రీ పెట్టిన ఓ పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే

చాహల్‌ - ధనశ్రీవర్మ 2020లో వివాహబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా చాహల్‌, ధనశ్రీ దంపతులు విడిపోతున్నారంటూ మీడియాలో వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఎందుకంటే వీరిద్దరూ ఒకరి నొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ ఫాలో చేసుకోవడంతో పాటు చాహల్‌ తన ఖాతా నుంచి భార్య ఫొటోలను తొలగించడంతో ఈ ఊహగానాలు మరింత ఎక్కువయ్యాయి.

Dhanashree Verma Breaks Silence Amid Divorce Rumours With Yuzvendra Chahal

వాస్తవానికి చాహల్ జంట సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. కానీ ఆ తర్వాత ఈ జంట పెట్టిన పోస్టులు అభిమానులను గందర గోళానికి గురి చేశాయి. దీంతో వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు గట్టిగా వచ్చాయి. ఈ క్రమంలోనే దీనిపై స్పందించిన చాహల్‌, తాము విడిపోవడం లేదని స్పష్టత ఇచ్చాడు.

కానీ మళ్లీ వీరిద్దరి మధ్య ఏమైందో స్పష్టంగా తెలీదు కానీ, ఈ జంట చేసిన కొన్ని చర్యల వల్ల వీరి విడుపోతున్నారనే ప్రచారం మరోసారి మొదలైంది. ఈ క్రమంలోనే తాజాగా ధనశ్రీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. కొన్ని రోజులుగా మీడియాలో వస్తోన్న వార్తల వల్ల తాను మానసిక వేదనకు గురౌతున్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది.

కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాం
''గత కొద్ది రోజులుగా నేను, నా ఫ్యామిలీ కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. నిజా నిజాలు తెలుసుకోకుండానే అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. నాపై ద్వేషం కలిగేలా సోషల్ మీడియాలో ట్రోల్స్‌ చేస్తున్నారు. నిజంగా ఈ విషయం నన్ చాలా బాధిస్తోంది. ఈ స్థాయికి రావడానికి నేను ఎన్నో ఏళ్లుగా శ్రమిస్తున్నాను. నేను మౌనంగా ఉన్నానంటే దానర్థం బలహీనంగా ఉన్నట్లు కాదు. సోషల్ ‌మీడియాలో నెగటివిటీ ఉన్నప్పటికీ ఇతరులపై కరుణ చూపాలంటే ధైర్యం ఎంతో అవసరం. నేను వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని విలువలతో ముందుకు సాగుతున్నాను. ఎప్పటికైనా నిజమే విజయం సాధిస్తుంది. దాన్ని సమర్థించుకోవాల్సిన అవసరం లేదు'' అని ధనశ్రీ ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టింది.

Story first published: Thursday, January 9, 2025, 10:23 [IST]
Other articles published on Jan 9, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+