తండ్రి అంత్యక్రియలు పూర్తి చేసి క్రికెట్ మ్యాచ్‌కు సిద్ధం..

హైదరాబాద్: కొద్ది రోజుల ముందే వెస్టిండీస్‌తో టెస్టు మ్యాచ్ ఉందనగా శ్రీలంక జట్టులో హఠాత్పరిణామం చోటు చేసుకుంది. శ్రీలంక క్రికెటర్ ధనంజయ డిసిల్వా.. హత్యతో జట్టులో విషాదం చోటు చేసుకుంది. వెస్టిండీస్ పర్యటనకు బయల్దేరనున్న శ్రీలంక క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ ధనంజయ డిసిల్వా తండ్రి రంజన్ మే 23న దారుణ హత్యకు గురవడంతో పర్యటన నుంచి తప్పుకున్నాడు.
స్థానిక రాజకీయ నాయకుడైన రంజన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే జట్టు నుంచి ధనంజయ తప్పుకున్నాడు. కానీ, లంక క్రికెట్ బోర్డు అతని స్థానంలో మరో ఆటగాడిని ఎంపిక చేయలేదు.
తాజాగా తన తండ్రి అంత్యక్రియలు, తదితర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ధనంజయ వెస్టిండీస్ పర్యటనకు బయలుదేరాడు. జూన్ 6 నుంచి శ్రీలంక-వెస్టిండీస్ మధ్య మూడు టెస్టుల సిరీస్ ఆరంభంకానుంది. జూన్ 4న అతడు కరీబియన్‌లో అడుగుపెట్టనున్నాడు. ఈ నేపథ్యంలో తొలి టెస్టుకు దూరమై.. రెండో టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్ధంకానున్నాడు.
మూడు టెస్టుల్లో భాగంగా జరగనున్న మ్యాచ్‌కు జూన్ 6వ తేదీన హాజరుకానున్నాడు. శ్రీలంక తరఫున అతడు 13 టెస్టులకు ప్రాతినిధ్యం వహించి 1066 పరుగులు సంపాదించాడు. కాగా, అతని సగటు 46.34.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications