Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రెండు మ్యాచ్‌లకే!: సన్‌రైజర్స్ ఓటమిపై పేసర్ సందీప్ శర్మ

Dew stopped aiding swing, made batting easier - Sandeep Sharma

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమితో ఆరంభించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ తర్వాత సమిష్టి కృషితో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఆ తర్వాత జట్టులో ఏమైందో తెలియదు గానీ, వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి మళ్లీ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోయింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

మిడిలార్డర్ చెత్త ప్రదర్శనే కారణంగా

మిడిలార్డర్ చెత్త ప్రదర్శనే కారణంగా

మిడిలార్డర్ చెత్త ప్రదర్శనే సన్‌రైజర్స్ ఓటమికి కారణమని సందీప్ శర్మ స్పందించాడు. టోర్నీలో భాగంగా సోమవారం మొహాలి వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో వార్నర్ హాఫ్ సెంచరీతో రాణించినప్పటికీ మిడిలార్డర్ రాణించకపోవడంతో సన్‌రైజర్స్ పరాజయం పాలైంది.

సందీప్ శర్మ మాట్లాడుతూ

సందీప్ శర్మ మాట్లాడుతూ

దీనిపై సందీప్ శర్మ మాట్లాడుతూ "గత నాలుగు మ్యాచుల్లోనూ ఓపెనర్లు వార్నర్, బెయిర్‌స్టోలు రాణిస్తుండడంతో మిడిలార్డర్‌కు ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం లభించలేదు. ముంబైతో, గత రాత్రి పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ మిడిలార్డర్‌కు అవకాశం వచ్చినా నిలబడలేకపోయింది. ఫలితంగా ఓటమి పాలైంది. సరిగ్గా ఇదే జట్టు కొంప ముంచుతోంది" అని పేర్కొన్నాడు.

రెండు మ్యాచ్‌లకే బలహీనతలపై మాట్లాడటం సరికాదు

రెండు మ్యాచ్‌లకే బలహీనతలపై మాట్లాడటం సరికాదు

సన్‌రైజర్స్ మిడిలార్డర్‌లో యూసుఫ్ పఠాన్, మహ్మద్ నబీ, దీపక్ హుడా, మనీశ్ పాండే లాంటి స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ సరైన భాగస్వామ్యాలను నమోదు చేయలేకపోతున్నారు. అయితే, వీరిలో అద్భుతమైన నైపుణ్యం దాగుందని సందీప్ శర్మ కొనియాడాడు. ఒకటి రెండు మ్యాచ్‌లకే బలహీనతల గురించి మాట్లాడడం సరికాదంటూనే రాబోయే రోజుల్లో మంచి ప్రదర్శన చేస్తామని చెప్పాడు.

Story first published: Tuesday, April 9, 2019, 17:34 [IST]
Other articles published on Apr 9, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+