Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs SRH: అరంగేట్ర మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ.. గేల్, ఏబీ సరసన దేవదూత్‌ పడిక్కల్‌!!

Devdutt Padikkal joins Chris Gayle, AB de Villiers in elusive list after sensational debut

దుబాయ్: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ ‌(ఐపీఎల్‌) ద్వారా మరో కుర్రాడు క్రికెట్ ప్రపంచానికి పరిచయమయ్యాడు. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు ఆడుతున్న కేరళ యువ ఆటగాడు దేవదూత్‌ పడిక్కల్‌ అరంగేట్ర ఐపీఎల్‌ మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పడిక్కల్‌ ఓపెనర్‌గా బరిలోకి (56; 42 బంతుల్లో 8x4)‌ పరుగుల వరద పారించాడు. పార్థీవ్‌ పటేల్‌ను పక్కన పెట్టి పడిక్కల్‌ను తుది జట్టులోకి తీసుకున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ నిర్ణయం సరైందే అని నిరూపించాడు.

36 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ:

36 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ:

ఐపీఎల్‌లో తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే యత్నంలో దేవదూత్‌ పడిక్కల్‌ అనుభవం ఉన్న ప్లేయర్‌లా ఆడాడు. సన్‌రైజర్స్‌ బౌలర్లపై దాడికి దిగి బౌండరీల వర్షం కురిపించాడు. దూకుడుగా ఆడుతూ 36 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ చేశాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే పడిక్కల్‌ దూకుడుగా ఆడడంతో.. మరో ఎండ్‌లో ఉన్న డేంజరస్ ఆటగాడు ఆరోన్ ఫించ్‌ కూడా ఆశ్చర్యపోయాడు. అతనికే ఎక్కువగా స్ట్రైక్ ఇస్తూ ప్రోత్సహించాడు. దీంతో పడిక్కల్‌ స్వేచ్ఛగా షాట్స్ ఆడాడు. అయితే హాఫ్ సెంచరీ అనంతరం విజయ్‌ శంకర్‌ వేసిన 11వ ఓవర్‌ చివరి బంతికి పడిక్కల్ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు.

గేల్, ఏబీ సరసన:

గేల్, ఏబీ సరసన:

బెంగళూరు తరఫున అరంగేట్ర మ్యాచ్‌ల్లో యాభై అంతకంటే ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో దేవదూత్‌ పడిక్కల్‌ ఐదో స్థానంలో నిలిచాడు. అంతకుముందు క్రిస్‌ గేల్ ‌(2011లో 102 నాటౌట్‌), ఏబీ డివిలియర్స్‌ (2011లో 54 నాటౌట్‌), యువరాజ్‌ సింగ్ ‌(2014లో 52 నాటౌట్‌), శ్రీవాత్స్‌ గోస్వామి (2008లో 52)లు అరంగేట్రం మ్యాచ్‌ల్లో హాఫ్‌ సెంచరీలు సాధించారు. ఇప్పుడు పడిక్కల్‌ వారి సరసన చేరాడు.

నాలుగు సందర్భాల్లో హాఫ్‌ సెంచరీ:

నాలుగు సందర్భాల్లో హాఫ్‌ సెంచరీ:

దేవదూత్ పడిక్కల్‌‌ తన అరంగేట్రం చేసిన మ్యాచ్‌ల్లో నాలుగు సందర్భాల్లో హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఫస్ట్‌క్లాస్‌ అరంగేట్రంల్లో భాగంగా 2018లో మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో (77 రెండో ఇన్నింగ్స్‌లో) హాఫ్‌ సెంచరీ చేశాడు. లిస్ట్‌-ఏ క్రికెట్‌లో భాగంగా జార్ఖండ్‌తో 2019 జరిగిన మ్యాచ్‌లో 58 పరుగులు బాదాడు. టీ20 ఫార్మాట్‌లో భాగంగా ఉత్తరాఖాండ్‌తో జరిగిన అరంగేట్రం మ్యాచ్‌లో పడిక్కల్‌ 53 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక ఇప్పుడు ఐపీఎల్‌లో హాఫ్‌ సెంచరీ సాధించాడు.

ప్రతి రెండు ఇన్నింగ్స్‌లకు ఓ అర్థ సెంచరీ:

ప్రతి రెండు ఇన్నింగ్స్‌లకు ఓ అర్థ సెంచరీ:

గత సీజన్‌లో విజయ్ హజారే వన్డే ట్రోఫీలో, సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీల్లో దేవదూత్ పడిక్కల్‌ అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. పడిక్కల్‌ 175.75 స్ట్రయిక్‌రేట్‌తో 580 పరుగులు చేశాడు. సగటున ప్రతి రెండు ఇన్నింగ్స్‌లకు ఓ అర్థ సెంచరీ సాధించి వెలుగులోకి వచ్చాడు. అదే ఐపీఎల్‌లో ఎంపికయేలా చేసింది. ఇక్కడా సత్తా చాటాడు. టోర్నీ ఆసాంతం రాణిస్తే.. టీమిండియాలోకి ఎంపికయ్యే అవకాశం కూడా ఉంది.

Story first published: Monday, September 21, 2020, 23:49 [IST]
Other articles published on Sep 21, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+