Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రాయల్ ఛాలెంజర్స్ కొత్త సారథిగా అతనొక్కడే బెస్ట్: కోహ్లీ లెగాసీ కంటిన్యూ: టీమిండియా మాజీ పేసర్

Devdutt Padikkal is my choice as RCBs Captain after Virat Kohli, says Ashish Nehra

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీకి ఓ చేదు జ్ఞాపకాన్ని మిగిల్చబోతోంది. సుదీర్ఘకాలం పాటు ఈ జట్టుకు నాయకత్వాన్ని వహించిన విరాట్ కోహ్లీకి ఇదే చివరి ఐపీఎల్. ఈ మెగా టోర్నమెంట్ ముగిసిన వెంటనే అతను కేప్టెన్‌గా తప్పుకోనున్నాడు. ఓ ప్లేయర్‌గా జట్టులో కొనసాగుతాడు. ఇప్పటిదాకా ఐపీఎల్ విన్నర్‌గా నిలవలేదీ టీమ్. అందుకే- ఈ సారి కప్‌ను కొట్టి.. కేప్టెన్‌గా విరాట్ కోహ్లీకి ఘనంగా వీడ్కోలు పలకాలనే పట్టుదలను ప్రదర్శిస్తోంది. దానికి తగ్గట్టే రాణిస్తోంది కూడా.

కోహ్లీకి ఘనంగా వీడ్కోలు..

కోహ్లీకి ఘనంగా వీడ్కోలు..

ఇప్పటికే ప్లేఆఫ్ అవకాశాలను ఖాయం చేసుకుంది. ఇంకో రెండు మ్యాచులను ఆడాల్సి ఉండగానే ప్లేఆఫ్స్‌ దశకు చేరుకుంది. మొత్తం 16 పాయింట్లతో టేబుల్ టాప్-3లో నిలిచింది. ఈ సాయంత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఓడినప్పటికీ.. భయపడాల్సిన పని ఉండదు. నెట్ రన్‌రేట్ తగ్గుతుందే తప్ప ప్లేఆఫ్ అవకాశాలపై మాత్రం ఎలాంటి దుష్ప్రభావం పడదు. లీగ్ దశలో ప్రదర్శించిన దూకుడు కొనసాగిస్తే.. ఈ సాల కప్ నమ్మదే అవుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు.

నలుగురి పేర్ల చుట్టూ

నలుగురి పేర్ల చుట్టూ

ఈ సీజన్ ముగిసిన తరువాత.. రాయల్ ఛాలెంజర్స్ కేప్టెన్‌గా విరాట్ కోహ్లీ వారసుడెవరనే ప్రశ్న తలెత్తుతుంది. దీనిపై ఇదివరకే ఓ సారి డిబేట్ చోటు చేసుకుంది. ఇదివరకే నలుగురి పేర్లు తెరమీదికి వచ్చాయి. ఈ నాలుగు పేర్లు చుట్టూ డిబేట్స్ నడిచాయి. ఏబీ డివిలియర్స్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, యజువేందర్ చాహల్, దేవ్‌దత్ పడిక్కల్ పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ నలుగురికీ విరాట్ కోహ్లీ లెగాసీని ముందుకు తీసుకెళ్లగల సత్తా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

పడిక్కల్ వైపు..

పడిక్కల్ వైపు..

ఇప్పుడు తాజాగా మళ్లీ అదే విషయం వార్తలోకి ఎక్కింది. విరాట్ కోహ్లీ వారసుడిగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపించగల శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉన్నాయనే విషయంపై టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ ఆశీష్ నెహ్రా స్పందించాడు. తన దృష్టిలో దేవ్‌దత్ పడిక్కల్ ఒక్కడికే ఆ సామర్థ్యం ఉందని అన్నాడు. జట్టు దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోగలిగితే- పడిక్కల్‌కు కేప్టెన్సీ పగ్గాలను అప్పగించాల్సి ఉంటుందని చెప్పాడు.

దీర్ఘకాల ప్రయోజనాల కోసం

దీర్ఘకాల ప్రయోజనాల కోసం

తన దృష్టిలో అతనొక్కడే బెస్ట్ ఆప్షన్‌గా కనిపిస్తోన్నాడని ఆశీష్ నెహ్రా వ్యాఖ్యానించాడు. 21 సంవత్సరాల దేవ్‌దత్ పడిక్కల్.. కర్ణాటకకు ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నాడు. జన్మతః అతను మలయాళీ అయినప్పటికీ.. తండ్రి ఉద్యోగ రీత్యా కర్ణాటకలో స్థిరపడాల్సి వచ్చింది. దేశవాళీ మ్యాచుల్లో అతను కర్ణాటక తరఫున ఆడుతున్నాడు. లోకల్ బాయ్ పేరుందతనికి. గత సీజన్‌లోనే అతను ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చాడు. నిలకడగా రాణిస్తున్నాడు. ఇప్పటిదాకా 26 మ్యాచులను ఆడిన పడిక్కల్ 822 పరుగులు చేశాడు. బెస్ట్ స్కోర్ 101 నాటౌట్.

Story first published: Wednesday, October 6, 2021, 17:19 [IST]
Other articles published on Oct 6, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+