ఆరేళ్ల కష్టానికి ఫలితం: ఉద్వేగానికి లోనైన ఎమ్మెస్కే
విశాఖపట్నం: భారత క్రికెట్‌లో ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) ముఖ్య భూమిక పోషిస్తుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఏసీఏ ప్రస్తుతం ఒక వెలుగు వెలుగుతోంది. బీసీసీఐలో ఏసీఏకి చెందిన పలువురికి ముఖ్య పదవులతో పాటు చీఫ్ సెలక్టర్‌గా ఎమ్మెస్కే ప్రసాద్ ఎంపిక మనందరం సంతోషించాల్సిన విషయం.
అంతేకాదు ఈ మధ్య కాలంలో ఏసీఏ సాధ్యమైనన్ని మ్యాచ్‌లను నిర్వహిస్తోంది. ఇటీవలే న్యూజిలాండ్‌తో వన్డే సిరిస్‌కు ఆతిథ్యం ఇచ్చిన విశాఖ తాజాగా టెస్టు మ్యాచ్‌కి ఆతిథ్యం ఇచ్చింది. గత ఆరేళ్ల కాలంలో ఆంధ్ర క్రికెట్ చాలా మారిపోయింది. దీనికంతటికి కారణం భారత ఛీప్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అనడంలో ఎటువంటి సందేహాం లేదు.
ఏసీఏ క్రికెట్ ఆపరేషన్స్ డెరైక్టర్‌గా స్టేడియాలు, క్రికెట్ అకాడమీల నిర్మాణం, నిర్వహణలో ఎమ్మెస్కే ప్రసాద్ కీలకంగా వ్యవహరించారు. భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య విశాఖపట్నంలో టెస్టు మ్యాచ్ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు.

ఆంధ్ర క్రికెట్‌లో ఇదో చారిత్రాత్మక సందర్భం
'ఆంధ్ర క్రికెట్‌లో ఇదో చారిత్రాత్మక సందర్భం. ఈ రోజు కోసం మేం ఆరేళ్లుగా కలలుగంటున్నాం. గురువారం విశాఖలో టెస్టు క్రికెట్‌లో అత్యుత్తమ జట్లలో ఒకటైన ఇంగ్లాండ్‌తో టీమిండియా తలపడుతుంది. ఈ ప్రాంతం నుంచి టీమిండియాకు ఆడిన నాకు ఈ క్షణాలు ఎంతో ఉద్విగ్నంగా ఉన్నాయి. ఆంధ్ర క్రికెట్ సంఘం పరిధిలో ఏర్పాటు చేసిన మైదానాలు, అకాడమీలు బోర్డును ఆకట్టుకున్నాయి. వీటన్నింటి వల్లే విశాఖకు టెస్టు హోదా సాధ్యమైంది. ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు'.

సెలక్షన్ కమిటీ చైర్మన్ అవకాశం రావడం గొప్ప
'వన్డే ప్రపంచకప్ వరకు సెలక్షన్ కమిటీ చైర్మన్ అవకాశం రావడం గొప్ప గౌరవం. ప్రస్తుత కమిటీ దీర్ఘకాలిక లక్ష్యాలతో ముందుకు వెళుతోంది. 2019 ప్రపంచకప్ వరకూ మాకు ప్రణాళికలు ఉన్నారుు. ఆలోగా భారత్ సుమారు 60 వన్డేలు ఆడుతుంది. వాటి ద్వారా ప్రపంచకప్ టోర్నీకి కూడా మంచి జట్టును తయారు చేస్తాం. ప్రతి విషయంలోనూ పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నాం'.

టెస్టు మ్యాచ్‌లకు ఎక్కువ ప్రాధాన్యం
రాబోయే నాలుగేళ్లు టెస్టు మ్యాచ్‌లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. దీని కోసం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. బీసీసీఐ టెస్టు క్రికెట్ కోసం అదనంగా నిధులు కేటాయిస్తోందని, ఈ ఫార్మా ట్ పట్ల బోర్డు అంకితభావంతో ఉందని తెలిపారు. బోర్డుతో పాటు దేశంలో ప్రతి క్రికెటర్ కూడా టెస్టుల కోసం ఎంతో ఆసక్తిగా ఉన్నారని అన్నారు. టెస్టు క్రికెట్ అసలైన క్రికెట్ అనేది అందరి భావన, అదే నిజం కూడా అని ఎమ్మెస్కే ప్రసాద్ పేర్కొన్నారు.

గంభీర్ స్ధానంలో కేఎల్ రాహుల్‌కు చోటు
గంభీర్ స్ధానంలో కేఎల్ రాహుల్‌కు చోటు కల్పించడంపై ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించాడు. కేఎల్ రాహుల్ తొడ గాయం కారణం తర్వాత కోలుకుని రంజీ మ్యాచ్ ఆడి ఫిట్‌నెస్‌ను, ఫామ్‌ను నిరూపించుకున్నాడు. అందుబాటులో రాగానే జట్టులోకి తీసుకున్నామని, జట్టులో ప్రస్తుతం ఉన్న 15 మంది సమర్థులేనని చెప్పాడు. అందులోంచి ఉత్తమ తుది జట్టును మేనేజ్‌మెంట్ ఎంచుకుంటుందని తెలిపాడు.

బీసీసీఐ దీనిని తప్పనిసరి చేసింది
టీమ్ మేనేజ్‌మెంట్‌లో ఇప్పుడు సెలక్టర్లు కూడా భాగమని, గతేడాది నుంచి బీసీసీఐ దీనిని తప్పనిసరి చేసిందని తెలిపాడు. మేనేజర్ నేతృత్వంలో కోచ్, కెప్టెన్, వైస్ కెప్టెన్, సెలక్టర్ కలిసి తుది జట్టును ఎంపిక చేస్తున్నారని పేర్కొన్నాడు. సెలక్టర్లు, టీమ్ ఒకే మార్గంలో నడవడానికి వీలుగా బోర్డు ఈ నిర్ణయం తీసుకుందన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications