దేవదర్ ట్రోఫీలో భారత్ బీ బోణీ అదిరిపోయింది!!

న్యూ ఢిల్లీ: దేవధర్ ట్రోఫీలో శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని భారత్ బి అదిరిపోయే బోణీ కొట్టింది. మంగళవారం భారత్ ఎతో జరిగిన మ్యాచ్‌లో భారత్ బి 43 పరుగుల తేడాతో విజయం సాధించి పాయింట్ల ఖాతా తెరిచింది. భారత్ బి నిర్దేశించిన 262 పరుగుల లక్ష్యఛేదనలో..షాబాజ్ నదీమ్(3/32), మయాంక్ మార్కండే(4/48) ధాటికి 46.4 ఓవర్లలో 218 పరుగులకు కుప్పకూలింది.

పృథ్వీ.. దురదృష్టవశాత్తు అవుట్ అయిపోగా:
నదీమ్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో వరుస బంతుల్లో ఓపెనర్ పృథ్వీషా(7), కరుణ్ నాయర్(0)ను పెవిలియన్ పంపి ఆదిలోనే కోలుకోలేని దెబ్బకొట్టాడు. ఈ మధ్యే అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసి అంచనాలకు మించి రాణించిన ముంబైకర్ పృథ్వీ..దురదృష్టవశాత్తు వికెట్లు ముందు దొరికిపోగా, తాను ఎదుర్కొన్న తొలి బంతికే నాయర్ నిష్క్రమించాడు. ఇదే క్రమంలో అన్మోల్‌ప్రీత్‌సింగ్(16) ఔట్ కావడంతో దినేశ్ కార్తీక్ కెప్టెన్సీలోని భారత్ ఎ 36 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది.

పది బంతుల తేడాతోనే ఔట్ కావడంతో
అంకిత్‌బావ్నె(3), కృనాల్ పాండ్యా(17) వెంటవెంటనే ఔట్ కావడంతో స్కోరు 87/5కు చేరుకుంది. ఈ తరుణంలో కెప్టెన్ కార్తీక్(114 బంతుల్లో 99, 11ఫోర్లు, సిక్స్), అశ్విన్(76 బంతుల్లో 54, 5ఫోర్లు) ఇన్నింగ్స్‌ను గాడిలో పడేశారు. వీరిద్దరు భారత్ బి బౌలింగ్‌ను అలవోకగా ఎదుర్కొంటూ సమయోచిత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో ఆరో వికెట్‌కు ఈ ఇద్దరు కలిసి 123 పరుగులు జోడించి గెలుపుపై ఆశలు రేపారు. అయితే పది బంతుల తేడాతోనే వీరిద్దరు ఔట్ కావడంతో భారత్ ఎ తిరిగి కోలుకోలేకపోయింది.

సెంచరీ చేజార్చుకున్న కార్తీక్‌ను నదీమ్ ఔట్ చేయగా
పరుగు తేడాతో సెంచరీ చేజార్చుకున్న కార్తీక్‌ను నదీమ్ ఔట్ చేయగా, అశ్విన్‌ను మార్కండే పెవిలియన్ పంపాడు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ బి..హనుమ విహారి(95 బంతుల్లో 87 నాటౌట్, 9ఫోర్లు), మనోజ్‌తివారీ(52) అర్ధసెంచరీలతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 261 స్కోరు చేసింది. 28 పరుగులకే గైక్వాడ్(2) వికెట్ కోల్పోయిన జట్టుకు మయాంక్ అగర్వాల్(46), కెప్టెన్ అయ్యర్(41) మెరుగైన శుభారంభమిచ్చారు. పది పరుగుల వ్యవధిలోనే వీరిద్దరు ఔట్ కావడంతో విహారి, మనోజ్ తివారీ గాడిలో పడేశారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 99 పరుగులు జోడించారు.

300 పరుగుల మార్క్ దాటుతుందనిపించినా
ఓ దశలో వీరి బ్యాటింగ్ చూస్తే సులువుగా 300 పరుగుల మార్క్ దాటుతుందని అనిపించింది. కానీ మనోజ్ రనౌట్ తర్వాత వచ్చిన ఏ ఒక్కరూ క్రీజులో నిలదొక్కుకోలేకపోవడంతో 261స్కోరుకు పరిమితమైంది. అశ్విన్(2/39)కు రెండు వికెట్లు తీయగా, ధవల్ కులకర్ణి, సిరాజ్, సిద్దార్థ్ కౌల్, కృనాల్, శ్రేయాస్ గోపాల్ ఒక్కో వికెట్ తీశారు. బుధవారం భారత్ బి, సి జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications