అసలేం జరిగింది?: కోర్టుకెక్కిన కేరళ మహిళా అథ్లెట్
హైదరాబాద్: లండన్ వేదికగా ఆగస్టు 4న మొదలయ్యే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌నకు కేరళ మహిళా అథ్లెట్ పియు చిత్రను ఎంపిక చేయకపోవడంపై పీటీ ఉష బుధవారం వివరణ ఇచ్చింది. ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఏఏఎఫ్) నిర్దేశించిన అర్హత మార్క్‌ను అందుకోలేకపోవడం వల్లే చిత్రను జాతీయ జట్టుకు ఎంపిక చేయలేదని ఉష పేర్కొంది.
వివరాల్లోకి వెళితే... భువనేశ్వర్‌లో ఇటీవల జరిగిన ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 1500 మీటర్ల విభాగంలో పసిడి పతకం నెగ్గడం ద్వారా చిత్ర ప్రపంచ టోర్నీకి నేరుగా అర్హత సాధించింది. అయితే భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) ప్రపంచ చాంపియన్‌షిప్ కోసం ఎంపిక చేసిన జట్టులో చిత్రకు చోటు కల్పించలేదు.

పీటీ ఉష ఉన్నప్పటికీ చిత్రకు మొండిచేయి
సెలెక్షన్ కమిటీలో కేరళకే చెందిన పీటీ ఉష ఉన్నప్పటికీ చిత్రకు మొండిచేయి ఎదురవడం గమనార్హం. అయితే చిత్ర ప్రాతినిధ్యం వహిస్తున్న ఈవెంట్లో ఐఏఏఎఫ్ అర్హత మార్క్‌కు ఆమె చాలా దూరంలో ఉన్న కారణంగానే ఏఎఫ్‌ఐ ఈ నిర్ణయం తీసుకుందని ఉష పేర్కొంది. తాను ఏఎఫ్‌ఐ ఎంపిక కమిటీలో సభ్యురాలిని కాదని, కేవలం పరిశీలకురాలిగానే సమావేశానికి హాజరైనట్లు ఆమె స్పష్టం చేసింది.

కేరళ హైకోర్టుని ఆశ్రయించిన చిత్ర
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పోటీపడే భారత అథ్లెట్ల జాబితాలో తన పేరు లేకపోవడంతో చిత్ర కేరళ హైకోర్టుని ఆశ్రయించింది. ప్రపంచ చాంపియన్‌షిప్ టోర్నీలో పాల్గొనాలంటే అథ్లెట్ నిర్ణీత ప్రమాణాలను అందుకోవాలి లేదా ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ లాంటి టోర్నీలో పతకం గెలవాలి.

#IsupportChitra హ్యాస్‌ట్యాగ్‌తో చిత్రకు మద్దతు
ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పసిడి పతకం నెగ్గినా... చిత్రను పక్కన పెట్టడంతో ప్రస్తుతం కేరళ వాసులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. #IsupportChitra హ్యాస్‌ట్యాగ్‌తో మద్దతు తెలుపుతున్నారు. లండన్‌కి వెళ్లే జట్టులో చిత్రను ఎంపిక చేయకపోవడంతో కేరళ సీఎం పీ విజయన్ కూడా చిత్రకు బాసటగా నిలిచారు.

కేంద్ర క్రీడల మంత్రికి కేరళ సీఎం లేఖ
చిత్ర పేరు చేర్చాలని కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయెల్‌కి లేఖ రాస్తానని కేరళ సీఎం విజయన్ స్పష్టం చేశారు. ఈ విషయంలో కేంద్ర క్రీడాశాఖపై ఒత్తిడి తీసుకొస్తామని పేర్కొన్నారు. మరోవైపు దీనిపై భారత క్రీడా ప్రాధికారిక సంస్థ(సాయ్) కూడా ఏఎఫ్‌ఐ వివరణ కోరింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications