Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ENG VS AUS: 165..మోత మోగించిన బెన్ డకెట్ - ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో రికార్డు స్కోరు

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మ్యాచ్ లో ఇంగ్లాండ్ అదిరే దూకుడు ప్రదర్శన చేసింది. ఓపెనర్ బెన్ డకెట్ (143 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్స్ ల సాయంతో 165) సెంచరీ తోడవ్వడంతో ఆస్ట్రేలియా ముందు ఏకంగా 352 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

చరిత్రలోనే రికార్డ్ స్కోర్..
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 351 పరుగులు చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఈ ఇన్నింగ్స్ లో 95 బంతుల్లో సెంచరీ మార్క్ ను టచ్ చేసిన డకెట్.. మరో 39 బంతుల్లో 150 పరుగుల మార్క్ ను టచ్ చేశాడు. మొత్తంగా 165 పరుగులు చేశాడు. తద్వారా ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు.

ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక స్కోర్లు ఇవే

  • ఇంగ్లాండ్ 351/8 - ఆస్ట్రేలియాపై, 2025*
  • న్యూజిలాండ్ 347/4 - 2004లో యూఎస్ఏపై
  • పాకిస్థాన్ 338/4 - 2017లో టీమిండియాపై
  • టీమిండియా 331/7 - 2013లో దక్షిణాఫ్రికాపై
1
63680

158 పరుగుల భారీ భాగస్వామ్యం..
బెన్ డకెట్ తో పాటు జో రూట్ (78 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 68 పరుగులు) కూడా మంచిగా రాణించి అర్ధ శతకంతో మెరిశాడు. వాస్తవానికి ఓపెనర్ ఫిల్ సాల్ట్ (10), ఆ తర్వాత జేమీ స్మిత్ (15) త్వరగానే ఔట్ అవ్వడంతో ఇంగ్లాండ్ 43 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లోకి వెళ్తున్నట్లు కనిపించింది. కానీ అప్పుడే రూట్ తో కలిసి డకెట్‌ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో ఈ ద్వయం మూడో వికెట్‌కు 158 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది.

చివర్లో లియామ్ లివింగ్ స్టోన్(14), జోఫ్రా ఆర్చర్ (21) పర్వాలేదనిపించారు. హ్యారీ బ్రూక్ (3) నిరాశపరిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో బెన్ డ్వారిషూస్‌ 3 వికెట్లు పడగొట్టగా.. అడం జంపా, మార్నస్ లబుషేన్ తలో రెండు వికెట్లు తీశారు. గ్లెన్ మ్యాక్స్ వెల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.

Den Buckett century England targets 352 runs for australia in ChampionsTrophy Aus vs Eng match
uote class="twitter-tweet">

A record-breaking knock from Ben Duckett set the tone for England's mammoth total against Australia 🔥#ChampionsTrophy #AUSvENG ✍️: https://t.co/DBjsJNDgkY pic.twitter.com/NCDDqeCfLT

— ICC (@ICC) February 22, 2025
Story first published: Saturday, February 22, 2025, 18:36 [IST]
Other articles published on Feb 22, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+