
బ్రిస్బేన్ హీట్ టైటిల్ విజేతగా
తాజా సీజన్‌లో బ్రిస్బేన్ హీట్ టైటిల్ విజేతగా నిలవడంతో డెలిస్సా కిమ్మిన్స్ వీరిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని సోషల్ మీడియాలో బయటపెట్టింది. 30 ఏళ్ల డెలిస్సా కిమ్మిన్స్ 2008లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసింది. ఆ మరుసటి ఏడాది క్రికెట్ నుంచి విరామం తీసుకుంది.

బంగ్లాదేశ్ ఆతిథ్యమిచ్చిన
ఆ తర్వాత 2014లో బంగ్లాదేశ్ ఆతిథ్యమిచ్చిన ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌కప్‌తో ఆస్ట్రేలియా జట్టులో తిరిగి చోటు దక్కించుకుంది. అతి తక్కువ కాలంలోనే డెలిస్సా కిమ్మిన్స్ ఆ తర్వాత జట్టులో కీలక క్రికెటర్‌గా గుర్తింపు పొందింది. మహిళల బిగ్‌బాష్ లీగ్ ఆరంభ సీజన్‌లో క్వీన్స్‌లాండ్ ఫైర్ జట్టు కెప్టెన్‌గా అద్భుతంగా నడిపించింది.
గత మూడు సీజన్లుగా
ఇక, లారా హారిస్ విషయానికి వస్తే గత మూడు సీజన్లుగా బ్రిస్బేన్ హీట్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోంది. సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన బిగ్‌బాష్ లీగ్ ఫైనల్స్‌లో లారా హారిస్ ఫోర్ బాది జట్టుకు విజయాన్ని అందించింది. వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం ఈ సీజన్‌తో వెలుగులోకి రావడంతో బ్రిస్బేన్ హీట్ ప్రాంఛైజీ తన ట్విట్టర్‌లో అభినందించింది.
ప్రామిస్‌ను నిలబెట్టుకున్న హారిస్
ఈ మేరకు ట్విట్టర్‌లో "మనం గనుక ఫైనల్ గెలిస్తే నేను నీకోసం రింగ్ కొంటాను... డెలిస్సా కిమ్మిన్స్ తన ప్రామిస్‌ను నిలబెట్టుకుంది. డెలిస్సా కిమ్మిన్స్, లారా హారిస్‌లకు శుభాకాంక్షలు" అంటూ బ్రిస్బేన్ హీట్ ప్రాంఛైజీ తన ట్విట్టర్‌లో వీరిద్దరి ఫోటోను పోస్టు చేస్తూ కామెంట్ పెట్టింది. ఈ ట్వీట్‌కు డెలిస్సా కిమ్మిన్స్ "ప్రామిస్ నిలబెట్టుకునేందుక కొంచెం ఆసల్యమంది" అంటూ రీట్వీట్ చేసింది.

అద్భుతమైన కెరీర్
కిమ్మిన్స్ విషయానికి వస్తే ఆమె క్రికెట్ ఆస్ట్రేలియా తరుపున అద్భుతమైన కెరీర్‌ను కలిగి ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా క్రికెట్ ఆస్ట్రేలియా జాతీయ కాంట్రాక్ట్‌లో ఆమె కొనసాగుతున్నారు. గతేడాది వెస్టిండిస్ వేదికగా జరిగిన మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో సైతం ఆమె ఆడారు. మహిళల యాషెస్ సిరిస్‌లో భాగంగా ఆమె సదరన్ స్టార్స్ జట్టుకు కూడా ఎంపికైంది.

అరుదైన క్లబ్‌లోకి
అయితే, ప్రపంచ క్రికెట్‌లో ఇద్దరు మహిళా క్రికెటర్లు రిలేషన్‌పిప్‌లో ఇదే మొదటిసారి కాదు. ఈ క్లబ్‌లో న్యూజిలాండ్‌కు చెందిన లీ తహుహు, ఆమె శాట్టర్‌వైట్‌తో పాటు ఆస్ట్రేలియాకు చెందిన అలెక్స్ బ్లాక్‌వెల్, లిన్సే అస్క్యూలు ఇలా చాలా మంది ఈ క్లబ్‌లో ఉన్నారు. ఆ తర్వాత న్యూజిలాండ్ మహిళా క్రికెటర్లు హేలీ జెన్సెన్, నికోలా హన్‌కాక్‌లు వివాహా బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications












