Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా రాబ్ కాసెల్‌

IPL 2020 : Rajasthan Royals Appoint Rob Cassell As Fast Bowling Coach For IPL 2020 ! || Oneindia
Delighted to have Rob Cassell on board as fast bowling coach: Rajasthan Royals

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 ఎడిషన్ కోసం ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ రాబ్ కాసెల్‌ను తమ కొత్త ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా నియమిస్తున్నట్లు రాజస్థాన్ రాయల్స్ ప్రకటించింది. అయితే, గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా విధులు నిర్వహించిన స్టీఫాన్ జోన్స్ కూడా జట్టుతో కొనసాగుతారని తెలిపింది.

ఈ మేరకు రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ ఆండ్రూ మెక్ డోనాల్డ్ మాట్లాడుతూ "రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం కొత్త ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా రాబ్ కాసెల్‌ను నియమించడం చాలా ఆనందంగా ఉంది. విక్టోరియాకు ఆడే రోజుల నుంచి మా ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. నేను అతడి కెరీర్‌ను దగ్గరగా అనుసరించాను. ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా సుదీర్ఘ అనుభం ఉంది" అని అన్నాడు.

"అతని కోచింగ్ మరియు మార్గదర్శకత్వంలో అనేక మంది ఫాస్ట్ బౌలర్లు ఐసీసీ ర్యాంకుల్లో చోటు దక్కించుకోవడంతో పాటు ఉన్నత స్థాయిలో ఉన్నారు. దీంతో అతడి సేవలను మేము ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ వద్ద ఉపయోగించుకోవాలని చూస్తున్నాము. అతడి అనుభవం మా బౌలింగ్ లైనప్‌కు కీలకమైనదని తప్పక రుజువు చేస్తుంది" అని వెల్లడించాడు.

రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా ఎంపికవడంపై రాబ్ కాసెల్ సంతోషం వ్యక్తం చేశాడు. భారత్, విదేశీ పేసర్లతో రాజస్థాన్ రాయల్స్ జట్టు గొప్ప ఫాస్ట్ బౌలింగ్ లైనప్‌ను కలిగి ఉందని అన్నాడు. గత కొంతకాలంగా రాయల్స్‌‌ను అనుసరిస్తున్నానని.. డైనమిక్, ఉత్తేజకరమైన, అత్యంత పోటీతత్వ ఫాస్ట్ బౌలింగ్ లైనప్ అని అన్నాడు.

అందువల్ల తన ఆలోచనలతో కలిసి పనిచేయడానికి జట్టు సామర్థ్యాలను పెంచడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే, రాబ్ కాసెల్‌‌కు గతంలో దక్షిణాఫ్రికా, ఐర్లాండు పురుషుల జట్టు కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉంది. వెల్లింగ్టన్ స్కూల్లో స్పోర్ట్ డైరెక్టర్‌గా తన పాత్రను కొనసాగిస్తూనే జోన్స్ రాయల్స్‌తో కలిసి పని చేయనున్నాడు.

Story first published: Thursday, January 23, 2020, 18:01 [IST]
Other articles published on Jan 23, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+