న్యూఢిల్లీ: భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సచిన్ టెండూల్కర్, మెక్‌గ్రాత్‌లను సమంచేశాడు. దక్షిణాఫ్రికాపై జరిగిన నాలుగో టెస్టులో అశ్విన్ సోమవారంనాడు మరో ఐదు వికెట్లు తీశాడు. దాంతో నాలుగో టెస్టు మ్యాచులో దక్షిణాఫ్రికా 337 పరుగుల భారీ తేడాతో అపజయాన్ని మూటగట్టుకుంది.
దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ సిరీస్‌లో అశ్విన్ విశేషమైన ప్రతిభ కనపరించాడు. 31 వికెట్లు తీసుకుని అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు. దాంతో ఆయనకు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది. మ్యాన్ ఆఫ్ ద అవార్డు ఐదు సార్లు గెలుచుకున్ ఆటగాడిగా అశ్విన్ నిలిచాడు.
దాంతో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, మెక్‌గ్రాత్‌లను సమం చేశాడు. అశ్విన్‌కు ఇది 12వ సిరీస్. టెండూల్కర్ 74 సిరీస్‌లు ఆడగా, సెహ్వాగ్ 39 సిరీస్‌లు ఆడాడు. భారత్ క్రికెటర్లో అశ్విన్, టెండూల్కర్, సెహ్వాగ్ టాప్‌లో నిలువగా మొహమ్మద్ అజరుద్దిన్, జహీర్ ఖాన్, సౌరవ్ గంగూలీ మూడేసి సార్లు ఎన్నికై ఆ తర్వాత స్థానంలో నిలిచారు.
తన మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డును అశ్విన్ వరద తాకిడికి గురైన చెన్నై నగర ప్రజలకు అంకితం చేశాడు. ముత్తయ్య మురళీధరన్ 11 సార్లు మ్యాన్ ఆప్ ద సిరీస్‌ను గెలుచుకున్న అగ్రస్థానంలో నిలించాడు.

టెస్టు మ్యాచుల్లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలుచుకున్న అటగాళ్లు
11 - ముత్తయ్య మురళీథరన్ (శ్రీలంక)
9 - జాక్విస్ కల్లిస్ (దక్షిణాఫ్రికా)
8 - ఇమ్రాన్ ఖాన్ (పాకిస్తాన్), రిచర్డ్ హాడ్లీ ((న్యూజిలాండ్), షేన్ వార్న్ (ఆస్ట్రేలియా)
7- వసీం అక్రమ్ (పాకిస్తాన్), శివనరైన్ చంద్రపాల్ (వెస్టిండీస్)
6 - మాల్కం మార్షల్ (వెస్టిండీస్), కర్ట్‌లీ ఆంబ్రోస్ (వెస్టిండీస్), స్టీవ్ వా (ఆస్ట్రేలియా)
5 - అశ్విన్, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ (భారత్), గ్రాహమ్ గూచ్, ఆండ్ర్యూ స్ట్రాస్ (ఇంగ్లాండు), గ్లెన్ మెక్‌గ్రాత్, మైకేల్ క్లార్క్ (ఆస్ట్రేలియా), డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా), వకార్ యూనిస్ (పాకిస్తాన్)