
హైదరాబాద్: రాజకీయ నాయకుడి కొడుకా మజాకా.! ఢిల్లీ టీ20 జట్టుకు బిహార్ రాజకీయ నాయకుడు పప్పు యాదవ్ కొడుకు శార్తక్ రంజన్‌ను ఎంపిక చేయడంపై వివాదం చెలరేగింది. ఇప్పటి వరకు ఒక్క గేమ్ కూడా ఆడని వ్యక్తిని నేరుగా టీ 20కి సెలక్ట్ చేసింది.
ఢిల్లీ సెలక్షన్ కమిటీ.. అండర్-23 టాప్ స్కోరర్‌గా నిలిచిన హితెన్ దలాల్‌ను రిజర్వ్‌ల్లో పెట్టి మరీ ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని శార్తక్‌కు జట్టులో చోటు కల్పించడం గమనార్హం.
పుప్పు యాదవ్ మాధేపురా నుంచి ఎంపీ. అతడి భార్య రంజీత్ రంజన్ కాంగ్రెస్ ఎంపీ. బాగా ఆడిన వాళ్లను కాదని, పలుకుబడి ఉన్న వ్యక్తి కొడుకును ఎంపిక చేశారంటూ అతుల్ వాసన్, హరి గిద్వాని, రాబిన్ సింగ్ జూనియర్‌లతో కూడిన సెలక్షన్ కమిటీపై అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వక్తమవుతూనే ఉన్నాయి.
ఈ సీజన్ ఆరంభంలో ఢిల్లీ రంజీ ట్రోఫీ ప్రాబబుల్స్‌లో కూడా శార్తక్‌కు చోటు దక్కింది. కానీ స్వయంగా అతడే ప్రాబబుల్స్ నుంచి తప్పుకున్నాడు. అతడు ఆటపై ఆసక్తి కోల్పోయాడని, బాడీ బిల్డింగ్‌పై దృష్టి పెట్టాడని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో శార్తక్ ఎంపిక ఢిల్లీ క్రికెట్లో దుమారం రేపుతోంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.