సెహ్వాగ్ బ్రదర్స్ కెమిస్ట్రీ అదుర్స్.. వీడియో వైరల్!
Viral Video: ఢిల్లీ ప్రీమియర్ లీగ్ టోర్నీలో భారత మాజీ క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ కుమారులు ఆర్యవీర్ సెహ్వాగ్, వేదాంత్ సెహ్వాగ్ స్టేడియంలో పంచుకున్న అరుదైన క్షణాలు ప్రస్తుతం సోషల్ మీడియా తెగ వైరల్ అవుతున్నాయి. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2026 అధికారిక సోషల్ మీడియా వేదికల ద్వారా విడుదలైన ఓ వీడియోలో సెహ్వాగ్ తనయులిద్దరూ మ్యాచ్‌కు ముందు స్టేడియంలో ఎంతో ఉత్సాహంగా కనిపించారు.
"సోదరభావం కన్నా ఏది గొప్పది కాదు" అనే క్యాప్షన్‌తో ఉన్న ఈ క్లిప్‌లో ఆర్యవీర్(ఆరెంజ్-బ్లూ జెర్సీ), వేదాంత్(ఎల్లో-బ్లూ కిట్) ఒకరినొకరు షేక్ హ్యాండ్ చేసుకుంటూ సరదాగా జోకులు వేసుకున్నారు. తోటి ఆటగాళ్లు, సపోర్టింగ్ స్టాఫ్ మధ్య వారు పంచుకున్న ఆ నవ్వులు, అన్యన్యత అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ వీడియో నేపథ్యాన వచ్చే 'తూ హి హై వహీ' పాట ఈ దృశ్యాలను మరింత భావోద్వేగభరితంగా మార్చింది.

వీరేంద్ర సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణాన్ని ఆరాధించిన అభిమానులకు, ఆయన ఇద్దరు కుమారులు ఇలా ఒకే వేదికపై కలిసి రాణిస్తుండటం నిజంగా ఓ అద్భుతమైన అనుభూతిని ఇస్తోంది. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ టోర్నీలో ఈ సోదరుల మధ్య ఉన్న బలమైన అనుబంధాన్ని ఈ వీడియో అద్ధం పడుతోంది. ఇదే కాకుండా ఈ ఇద్దరు సోదరులకు సంబంధించిన మరొక ఇంటర్వ్యూ క్లిప్ కూడా నెట్టింట వైరల్ అవుతోంది. అందులో ఆర్యవీర్ తన తండ్రి తనకు ఇచ్చిన ఓ ఫన్నీ సలహాను గుర్తుచేసుకుంటూ నవ్వుకుంటాడు. "బ్యాటింగ్ చేస్తున్నప్పడు పాటలు పాడమంటారు నాన్న.. కానీ నేను ఇప్పడైతే అలా చేయడం లేదు!" అంటూ ఆర్యవీర్ సరదాగా పంచుకున్నాడు. ఒకప్పుడు వీరేంద్ర సెహ్వాగ్ ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొనేటప్పుడు క్రీజులో కూల్‌గా ఉంటూ బాలీవుడ్ పాటలు గునుగుకునే ప్రసిద్ధ అలవాటును ఈ సంఘటన అభిమానులకు గుర్తుచేస్తోంది. మొత్తానికి సెహ్వాగ్ వారసులు స్టేడియంలో తమ ఆటతోనే కాకుండా ఇలాంటి మధురమైన క్షణాలతోనూ క్రికెట్ ప్రేమికుల హృదయాలను గెలుచుకుంటున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
