Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RRvsDC : జట్టులోకి బిగ్ హిట్టర్ బ్యాక్.. రాజస్థాన్‌తో తలపడే ఢిల్లీ జట్టు ఇదే!

ఐపీఎల్ 2023లో వరుసగా రెండు మ్యాచుల్లో ఓటమి పాలైన ఢిల్లీ క్యాపిటల్స్.. రాజస్థాన్‌తో తలపడేందుకు రెడీ అయింది. గువాహతిలోని బార్సపరా స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ ఆడటం లేదు. అతని పెళ్లి టైం దగ్గర పడటంతో మార్ష్ స్వదేశానికి వెళ్లాడు. ఇటీవలే మళ్లీ బౌలింగ్ చేయడం మొదలు పెట్టిన అతను ఢిల్లీకి చాలా కీలకం కానున్నాడు.

మిచెల్ మార్ష్ లేకపవడంతో అతని స్థానంలోకి రావ్‌మెన్ పావెల్, ఫిల్ సాల్ట్‌లలో ఒకరిని ఢిల్లీ ఆడించాల్సి ఉంది. వీరిలో ఎక్కువ శాతం రావ్‌మెన్ పావెల్‌ను తీసుకునే అవకాశాలే ఉన్నాయి. ఫినిషర్‌గా మంచి స్కిల్స్ చూపించిన పావెల్.. కనుక ఫామ్ అందుకొని, రెచ్చిపోతే ఎలాంటి టార్గెట్ అయినా చిన్నబోవాల్సిందే. దానికితోడు అవసరమైతే పావెల్ కూడా బౌలింగ్ చేస్తాడు. అలాగే మార్ష్ లేకపోవడంతో రైలీ రూసో మూడో స్థానానికి ప్రమోట్ అయ్యే ఛాన్స్ ఉంది.

rovman powell

అలాగే మినీ వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసిన బెంగాల్ పేసర్ ముఖేష్ కుమార్.. ఈ ఐపీఎల్‌లో తన ధరకు న్యాయం చెయ్యడం లేదు. దీంతో అతన్ని పక్కన పెట్టి చేతన్ సకారియాను ఢిల్లీ ఆడించే ఛాన్స్ ఉంది. అమన్ ఖాన్ కూడా గొప్పగా రాణించలేదు. అయితే అతనికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని డీసీ అనుకుంటున్నట్లు సమాచారం. తన అరంగేట్ర మ్యాచ్‌లో అదరగొట్టిన వికెట్ కీపర్ బ్యాటర్ అభిషేక్ పోరెల్‌కు ఈ మ్యాచ్‌లో కూడా అవకాశం దొరకడం గ్యారంటీ అని తెలుస్తోంది.

అయితే ఢిల్లీ ఓపెనర్లు పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ ఇద్దరూ తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. వీళ్లిద్దరూ చెలరేగితే ఢిల్లీ భారీ స్కోరు చేయగలదు. కానీ గత రెండు మ్యాచుల్లో షా పెద్ద స్కోర్లు చేయలేకపోయాడు. వార్నర్ మంచి స్కోర్లు చేసినా చాలా నెమ్మదిగా ఆడి విమర్శల పాలయ్యాడు. రిషభ్ పంత్ లేని సమయంలో వీళ్లిద్దరూ జట్టు బాధ్యత తీసుకొని రాణించాల్సిన అవసరం ఉంది.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు (అంచనా): డేవిడ్ వార్నర్ (కెప్టెన్), పృథ్వీ షా, రైలీ రూసో, సర్ఫరాజ్ ఖాన్, అభిషేక్ పోరెల్, రావ్‌మెన్ పావెల్, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, ఆన్రిచ్ నోర్యీ, ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్

ఇంపాక్ట్ ప్లేయర్ అభ్యర్థులు: మనీష్ పాండే, యష్ ధుల్, చేతన్ సకారియా, ముఖేష్ కుమార్, లలిత్ యాదవ్.

Story first published: Saturday, April 8, 2023, 12:17 [IST]
Other articles published on Apr 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+