
క్రికెటర్‌తో మాట్లాడిన నర్స్:
గతేడాది సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ యూఏఈలో ఐపీఎల్ 13వ సీజన్ మ్యాచ్‌లు జరిగాయి. సెప్టెంబరు 30న రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌కి సంబంధించిన సమాచారం కోసం ఓ భారత క్రికెటర్ని ఢిల్లీకి చెందిన ఓ నర్స్ సోషల్ మీడియా ద్వారా సంప్రదించింది. అయితే మ్యాచ్ వివరాలు చెప్పడానికి సదరు క్రికెటర్ నిరాకరించాడు. అంతేకాదు ఇలాంటి వివరాలు అడగకూడదని, తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తానని కూడా హెచ్చరించాడు. ఆ తర్వాత ఇదే విషయాన్ని బీసీసీఐకి కూడా చెప్పాడు. ఓ జాతీయ ఈ ఘటన గురించి సమాచారం బయటపెట్టింది.

గోప్యంగా క్రికెటర్ పేరు:
ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే విచారణ కూడా పూర్తయినట్లు ఏసీయూ చీఫ్ అజిత్ సింగ్ తెలిపారు. క్రికెటర్ పేరుని గోప్యంగా ఉంచిన ఏసీయూ.. భారత్ జట్టుకి అతను రెండేళ్ల క్రితం ప్రాతినిథ్యం వహించినట్లు మాత్రమే వెల్లడించింది. ఫిర్యాదు అందిన వెంటనే తాము విచారణ జరపగా.. క్రికెటర్‌తో గత మూడేళ్ల నుంచి నర్స్ టచ్‌లో ఉన్నట్లు తేలిందని అజిత్ సింగ్ తెలిపారు. సదరు నర్సుని పిలిపించి విచారించగా.. ఆమెకి బుకీ లేదా బెట్టింగ్ సంస్థలతో ఎలాంటి సంబంధాలు లేవని తేలినట్లు సింగ్ చెప్పుకొచ్చారు. మ్యాచ్‌పై బెట్టింగ్ వేసేందుకు మాత్రమే క్రికెటర్ని సంప్రదించిందని ఆయన స్పష్టం చేశారు.

ప్రొఫెషనల్ బుకీ కాదు:
'ఐపీఎల్ 2020 సమయంలోనే సదరు భారత క్రికెటర్ ఈ ఘటన గురించి మాకు చెప్పాడు. మేము విచారణ జరిపాం. ఆ నర్స్ తాను ఓ డాక్టర్ని అంటూ ఆ ప్లేయర్‌ను సంప్రదించింది. ఆమె ప్రొఫెషనల్ బుకీ కాదని విచారణలో తేలింది. ఆమెకు ఆ ప్లేయర్ ముందే తెలుసు. విచారణలో భాగంగా ఆ నర్స్‌ను కూడా పిలిచి ప్రశ్నించాం. కానీ ఆమె నుంచి ఎలాంటి సమాచారం లభించలేదు. దీంతో విచారణ ముగించాం' అని అజిత్ సింగ్ చెప్పారు. సమాచారం అడిగిన వెంటనే క్రికెటర్ కోపం తెచ్చుకోవడంతో.. అతనికి నర్స్ ఏడుపు ఎమోజీలను పంపిందని చెప్పారు.

మూడేళ్ల కిందటే పరిచయం:
సదరు ఇండియన్ క్రికెటర్‌కు ఈ నర్స్ మూడేళ్ల కిందటే ఆన్లైన్లో పరిచయమైనట్లు కూడా ఏసీయూ విచారణలో తేలింది. తాను ఢిల్లీకి చెందిన ఓ డాక్టర్ని అని, మీ అభిమానిని అంటూ క్రికెటర్‌తో పరిచయం పెంచుకున్నదని తెలిసింది. ఆ తర్వాత కూడా కొవిడ్-19కు సంబంధించి ఆమె సలహాలు తీసుకోవడానికి ఆ క్రికెటర్ ఆమెతో ఆన్లైన్లో టచ్‌లో ఉన్నాడు. అయితే తానెప్పుడూ ఆమెను నేరుగా కలవలేదని అతడు స్పష్టం చేశాడు.
Sydney Test: ఓపెనర్లుగా రోహిత్, గిల్.. విహారి మరో ఛాన్స్!! నటరాజన్‌కు షాక్!