Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపిఎల్ ‌4లో ఢిల్లీ బోణి: ఉత్కంఠ పోరులో పూణె వారియర్స్ ఓటమి

Delhi Daredevils
ముంబై: ఐపిఎల్‌ సిజన్‌-4లో ఢిల్లి డేర్‌డేవిల్స్‌ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌ మరో నాలుగు బంతులు మిగిలుండగానే 3వికెట్ల తేడాతో ఢిల్లిసని విజయం వరించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పుణ వారియర్స్‌కు యువరాజ్‌ సింగ్‌ (66), రైడర్‌ (60)లు అర్ధ శతకాలతో వారియర్స్‌కు 187/7 పరుగుల భారీ స్కోరును అందించారు. అయితే తర్వాత లక్ష్యచేదనకు దిగిన ఢీల్లిస డేర్‌డేవిల్స్‌కు ఓపెనర్లు, డేవిడ్‌ వార్నర్‌ (46), వీరేంద్ర సెహ్వాగ్‌ (37) పరుగుల శుభారంబాన్ని అందించారు. చివర్లో వేణుగొపాల్‌ రావు, ఫిన్చ్‌, హోప్స్‌లు ఢిల్లిస జట్టును విజయ తీరానికి చేర్చారు. బ్యాటింగ్‌లో రాణించిన పుణ కెప్టెన్‌ యువరాజ్‌ బౌలింగ్‌లోనూ విజృంభించి నాలుగు వికెట్లు తీశాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఆల్‌ రౌండ్‌ ప్రతిభ కనబర్చిన యువరాజ్‌ సింగ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

భారీ స్కోరుతో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లిసకి ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌, కెప్టెన్‌ వీరేంద్ర సెహ్వాగ్‌లు శుభారంబాన్ని అందించారు. వీరూ తొలి బంతి నుంచే బాదడం ప్రారంభించారు. ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తిస్తూ స్కోరును వేగంగా లక్ష్యం వైపు నడిపించారు. వీరి భారీ బాదుడుకు ఢిల్లిస కేవలం 29 బంతుల్లోనే తొలి 50 పరుగులు పూర్తి చేసుకొంది. చెలరేగి ఆడిన వార్నర్‌ కేవలం 28 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో 75 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెర పడింది. తర్వాత కొద్ది సేపటికే ధాటిగా ఆడుతున్న సెహ్వాగ్‌ కూడా రైడర్‌ అద్భుత బంతికి పెవిలియన్‌ చేరాడు. వేగంగా ఆడిన సెహ్వాగ్‌ 23 బంతుల్లో 6 ఫోర్లతో 37 పరుగులు చేశాడు.

తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్లు ఇర్ఫాన్‌ ప ఠాన్‌ (14), నామన్‌ ఓజా (11), వాడె (3)లు తక్కువ స్కోరుకే పెవిలియన్‌ చేరారు. దీంతో ఢిల్లిస 120 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో పుణకు విజయవకశాలు ఎక్కువగా కనిపించినా చివర్లో ఆంధ్ర ఆటగాడు వేణుగొపాల్‌రావు అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. వేణుగొపాల్‌ రావు 20 బంతుల్లో 3 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 31 పరుగులు చేసి జట్టును విజయానికి చేరువ చేశాడు. తర్వాత ఫిన్చ్‌ విధ్వంసకర షాట్లతో కేవలం 12 బంతుల్లో 2 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 25 పరుగులు చేశాడు. మరోవైపు జేమ్స్‌ హోప్స్‌ 4 బంతుల్లో 13 పరుగులు చేసి ఢిల్లిస డేర్‌డేవిల్స్‌కి తొలి విజయాన్ని అందించాడు. పుణ బౌలర్లలో యువరాజ్‌ సింగ్‌ విజృంభించి నాలుగు వికెట్లు పడగొట్టాడు.

అంతకు ముందు బ్యాటింగ్‌ చేసిన పుణ వారియర్స్‌కు ఓపెనర్‌ జెస్సీ రైడర్‌ వింధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. పుణ ప్రారంభంలోనే ఓపెనర్‌ గ్రేగ్‌ స్మిత్‌ (12) వికెట్‌ను కోల్పోయింది. దీంతో పుణ 28 పరుగుల వద్దే తొలి వికెట్‌ కోల్పోయింది. తర్వాత వచ్చిన మన్హాస్‌తో కలిసి రైడర్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. అయితే రైడర్‌ భారీ షాట్లతో విజృంభించాడు. దీంతో పుణ 32 బంతులకే 50 పరుగులను పూర్తి చేసుకుంది. తర్వాత కొద్ది సేపటికే మన్హాస్‌ (20) పరుగులు చేసి హోప్స్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరాడు. మరోవైపు రైడర్‌ ధాటిగా ఆడుతూ కేవలం 24 బంతుల్లోనే 5 సిక్సులు, 4 ఫోర్లతో అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. రైడర్‌ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ప్రతి బంతికి భారీ షాట్‌ కొడుతూ జట్టు స్కోరును వేగంగా పరిగెత్తించాడు.

అయితే ఈ క్రమంలోనే రైడర్‌ 27 బంతుల్లోనే 60 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత రాబిన్‌ ఉతప్ప (4), మిశ్రా (7)లు తక్కువ స్కోరుకే పెవిలియన్‌ చేరారు. ఈ సమయంలో యువరాజ్‌ సింగ్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఒక వైపు వికెట్లు పడుతున్నా కూడా తాను క్రీజులో నిల్చొని బౌండరీల వర్షం కురిపిస్తూ స్కోరు బోర్డును వేగంగా ముందుకు సాగించాడు. ఈ దశలోనే యువరాజ్‌ అర్ధ శతకాన్ని పూర్తి చేసుకొన్నాడు. ఇన్నింగ్స్‌ చివరి వరకు క్రీజులో నిల్చున్న యువీ కేవలం 32 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 66 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఢిల్లిస బౌలర్లలో అశోక్‌ దిండా, నదీమ్‌లు చెరో రెండు వికెట్లు తీశారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+