
హైదరాబాద్: అతుల్‌వాసన్, హరి గిద్వానీ, రాబిన్‌సింగ్ జూనియర్‌లతో కూడిన డీడీసీఏ సెలెక్షన్ కమిటీ ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. గతేడాది ఒక్క మ్యాచ్ ఆడకుండానే ఢిల్లీ 20 జట్టులో చోటు దక్కించుకున్న మాదేపురా ఎంపీ రాజేష్ రాజన్ (పప్పు యాదవ్) కుమారుడు సర్తాక్ రంజన్‌ను జట్టు నుంచి తప్పించింది.
అతడి స్థానంలో ఉన్ముక్త్ చంద్‌కు చోటు కల్పించారు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో భాగంగా ఢిల్లీ అండ్ డిస్ట్రిక్స్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) సీనియర్ సెలక్షన్ కమిటీ ఓ జట్టుని ఎంపిక చేసింది. ఈ జట్టులో పప్పుయాదవ్ కుమారుడు సర్తాక్ రంజన్ కూడా చోటు దక్కించుకున్నాడు.
అయితే గత ఏడాది ఒక్క మ్యాచ్ ఆడకుండానే ఢిల్లీ 20 జట్టులో సర్తాక్ రంజన్‌కు చోటు కల్పించడంపై సెలక్టర్లపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. గత ఏడాది నుంచి నిలకడగా రాణిస్తున్న ఇతర ఆటగాళ్లను పక్కన పెట్టి సర్తాక్ రంజన్‌కు చోటు కల్పించడంపై వివాదాస్పదమైంది.
గత సీజన్‌లో సీకే నాయుడు ట్రోఫీలో 91.58 స్టైక్ రేట్‌తో 468పరుగులు చేసిన హిటెన్ దళాల్ అనే ఆటగాడిని పక్కన పెట్టిమరీ రంజన్‌ను జట్టులోకి తీసుకున్నారు. సీకే నాయుడు ట్రోపీలో దళాల్ ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలతో 468 పరుగులు చేశాడు.
ఇక, సర్తాక్ రంజన్ విషయానికి వస్తే మూడు మ్యాచ్‌ల్లో కలిపి కేవలం 10 పరుగులు చేశాడు. గత రంజీ సీజన్‌కు ప్రకటించిన ఢిల్లీ ప్రాబబుల్స్‌లోనూ సర్తాక్‌కు చోటు కల్పించారు. కానీ అతడేమో హఠాత్తుగా ప్రాబబుల్స్ నుంచి వైదొలిగాడు. సర్తాక్‌కు క్రికెట్‌పై ఆసక్తిలేదని, బాడీబిల్డర్‌గా మారేందుకే ప్రాబబుల్స్ నుంచి తప్పుకొన్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి.
అయితే ఆశ్చర్యకరంగా సర్తాక్ తల్లి రంజీత్ రాజన్ తన కుమారుడు ఇప్పుడు క్రికెట్ ఆడటానికి ఫిట్‌గా ఉన్నాడంటూ ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోషియేషన్‌కు ఈమెయిల్ రాశారు. దీంతో మానసిక సమస్యలనుంచి సర్తాక్ బయటపడడంతో ఢిల్లీ అండర్-23 జట్టుకు స్టాండ్‌బైగా ఎంపిక చేశామని సెలక్షన్ కమిటీ సభ్యులు చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే జనవరి 21 నుంచి కోల్‌కతా వేదికగా సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ నాకౌట్ ఫేజ్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఢిల్లీ జట్టు:
ప్రదీప్ సాంగ్వాన్ (కెప్టెన్), గౌతం గంభీర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), నితీశ్ రాణా, ధృవ్ శౌర్య, ఉన్ముక్త్ చంద్, మిలింద్ కుమార్, లలిత్ యాదవ్, పవన్ నేగి, వరుణ్ సూద్, కుల్వంత్ కేజ్రోలియో, నవదీప్ షైనీ, సుబోధ్ బాటీ, వికాస్ టోకాస్, కిషిస్త్ శర్మ
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.