For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బీసీసీఐ కాంట్రాక్టు పోయింది: ఐపీఎల్‌కు షమీ అనుమానమే!

By Nageshwara Rao
Delhi Daredevils reviewing Mohammed Shami situation ahead of IPL 2018

హైదరాబాద్: తన భార్య చేసిన ఆరోపణలతో ఇప్పటికే ఉక్కిరి బిక్కిరి అవుతోన్న టీమిండియా క్రికెటర్ మహమ్మద్ షమీ తాజాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడటంపై కూడా అనుమానాలు నెలకొన్నాయి. తన భర్తతో పాటు ఆయన కుటుంబ సభ్యులు వేధింపులకు గురి చేశారని, మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని అతడి భార్య హసీన్ జహాన్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

బుధవారం సాయంత్రం హసీన్‌ జహాన్‌ తన న్యాయవాదితో కలిసి కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ను కలిసి లిఖిత పూర్వక ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు శుక్రవారం షమితో పాటు మరో నలుగురిపై ఐపీసీ 498ఏ, 323, 307, 376, 506, 328, 34 సెక్షన్ల కింద వీరిపై కేసులు నమోదు చేసినట్లు కోల్‌కతాలోని లాల్‌బజార్ పోలీసులు తెలిపారు.

భార్య హసీన్‌ జహాన్‌ చేసిన ఆరోపణలతో షమీని బీసీసీఐ వార్షిక వేతనాల కాంట్రాక్టు నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. తాజాగా పోలీసులు కేసు నమోదు చేసిన మహమ్మద్ షమీని ఐపీఎల్ క్యాంప్‌లకు అనుమతించాలా? వద్దా అనే సందిగ్ధంలో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ యాజమాన్యం ఉంది. ఈ విషయంలో బీసీసీఐ న్యాయసలహా తీసుకోవాలని యాజమాన్యం భావిస్తోంది.

'సున్నితమైన ఈ అంశంలో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ జట్టు తొందరపాటు నిర్ణయం తీసుకోదు. ఐపీఎల్‌లో పాల్గొనే అందరు ఆటగాళ్లు ఫ్రాంచైజీ, బీసీసీఐతో ఒప్పందాన్ని కలిగి ఉంటారు. అవును, షమీ విషయం సున్నితమైన విషయం కాబట్టి ఈ విషయంలో బీసీసీఐతో సం‍ప్రదింపులు జరుపుతున్నాం' ఓ సీనియర్‌ ఫ్రాంచైజీ అధికారి మీడియాకు తెలిపారు.

మరోవైపు ఈ కేసులో విషయంలో భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) సాయం తీసుకోవాలని నిర్ణయించుకుంది. 'ప్రస్తుతం మా న్యాయవాది బీసీసీఐతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ వ్యవహారం ఇక్కడితో తేలకపోతే రేపు భవిష్యత్తులో మరికొందరు ఆటగాళ్లు కూడా ఇలాగే చేసే అవకాశం కల్పించినట్లు అవుతుంది. ఒకవేళ ఇది బోర్డు పరిధిలోనే జరిగి ఉంటే మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది' అని ఆమె పేర్కొంది.

అయితే బీసీసీఐనే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ వ్యవహారానికి ముగింపు పలికే విధంగా ప్రయత్నాలు ప్రారంభించిందని.. ఈ మేరకు జహాన్‌కు రాజీ ప్రతిపాదన పంపిందన్న మరో కథనం జాతీయ మీడియాలో వస్తోంది. దీంతో బీసీసీఐ మధ్యవర్తిత్వంతో షమీ క్లీన్‌గా బయటకు వస్తే బాగుండని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన వేలంలో షమీని వేలంలో ఢిల్లీ రూ.3 కోట్లకు కొనుగోలు చేసిన సంగత తెలిసిందే. ఏది అయితేనేం ఈ వివాదంతో షమీ క్రికెట్ కెరీర్‌ ప్రశ్నార్ధకంగా మారనుంది.

మరోవైపు భార్య హసీన్‌ తనపై చేసిన ఆరోపణలు నిజమని తేలితే ఆమెకు క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని షమీ పేర్కొన్నాడు. ఇదంతా నా పేరును దెబ్బతీయడానికి చేస్తున్న కుట్ర. హసీన్‌కు మెంటల్ బ్యాలెన్స్ తప్పిందని, అందుకే నాపై నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని అంటున్నాడు.

Story first published: Saturday, March 10, 2018, 14:49 [IST]
Other articles published on Mar 10, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+