Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టెన్సీ కావాలని గౌతం గంభీర్ అడిగుతున్నాడు: పాంటింగ్

Delhi Daredevils coach Ricky Ponting says Gautam Gambhir is likely to lead the team in IPL 2018

హైదరాబాద్: ఐపీఎల్ 2018 సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్టుకు గౌతమ్ గంభీర్‌ని కెప్టెన్‌గా నియమించాలని తాము చర్చిస్తున్నట్లు ఆ జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్ వెల్లడించాడు. బెంగళూరు వేదికగా శనివారం జరిగిన వేలంలో గౌతమ్ గంభీర్‌ని రూ 2.8 కోట్లతో ఢిల్లీ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది.

గంభీర్ ఆశిస్తున్నాడనే..:
'ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్టుకి కెప్టెన్‌గా ఉండాలని గంభీర్ ఆశిస్తున్నాడు. దీనిపై మేము ఫ్రాంఛైజీలో చర్చిస్తున్నాం. కోల్‌కతాకి రెండు టైటిల్స్ అందించిన అతను జట్టుకి కెప్టెన్‌గా ఉంటే.. యువ క్రికెటర్లు రిషబ్ పంత్, శ్రేయాస్ లాంటి వారికి మేలు జరుగుతుంది' అని రికీ పాంటింగ్ వెల్లడించాడు.

ఏడేళ్లుగా గంభీర్ ఒకే జట్టులో..:
2011 నుంచి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుకి కెప్టెన్‌గా పనిచేసిన గంభీర్ రెండు సార్లు టైటిల్ అందించాడు. 2011లో గంభీర్‌ని రూ. 11.4 కోట్లకి కోల్‌కతా ఫ్రాంఛైజీ వేలంలో కొనుగోలు చేసింది.

అట్టిపెట్టుకోవడం, రైట్ టు మ్యాచ్ పద్ధతుల ద్వారా తనని మళ్లీ తీసుకోవద్దంటూ కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంఛైజీకి గౌతమ్ గంభీర్ ఇటీవలే చెప్పినట్లు తెలిసింది. దీంతో వేలంలో తక్కువ ధరకే గంభీర్ దొరికినా కోల్‌కతా మిన్నకుండిపోయింది.

పాంటింగ్‌కి ఢిల్లీ డేర్ డెవిల్స్ కొత్త జట్టే:
పాంటింగ్ 2015, 2016 సంవత్సరాలలో ముంబై ఇండియన్స్‌కు కోచ్‌గా వ్యవహరించారు. అదే కాకుండా కోల్‌కత్తా నైట్ రైడర్స్ తరపున ముంబై ఇండియన్స్ తరపున కూడా టీ20 టోర్నమెంట్‌లో ఆడారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Sunday, January 28, 2018, 11:55 [IST]
Other articles published on Jan 28, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+