చీర్ గర్ల్స్‌తో డేర్‌డెవిల్స్ డిన్నర్, ఆగ్రహం వ్యక్తం చేసిన ఏసీయూ

హైదరాబాద్: లీగ్ దశతో సరిపెట్టుకుని ఐపీఎల్ నుంచి నిష్క్రమించిన ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు మరో కలంకం వచ్చి పడింది. ప్లేఆఫ్ రేసుకు అర్హత కోల్పోయాక ఢిల్లీ యాజమాన్యం తమ ఆటగాళ్లకు విందు ఏర్పాటుచేసింది. తమతో పాటు చీర్ గర్ల్స్‌కు కూడా పార్టీకి ఆహ్వానించింది. బీసీసీఐ నిబంధనల ప్రకారం చీర్ గర్ల్స్.... జట్టుకు సంబంధించిన ఏ ప్రైవేటు కార్యక్రమంలోనూ పాల్గొనకూడదు. కానీ, ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ దానిని అతిక్రమించింది.

అమ్మాయిలను డిన్నర్‌కు:
తాజాగా ఆ అమ్మాయిలను డిన్నర్‌కు ఆహ్వానించినందుకు ఢిల్లీ డేర్‌డెవిల్స్ యాజమాన్యంపై బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ విభాగం అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయాన్ని తెలుసుకున్న బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ విభాగం అధికారులు ఫ్రాంఛైజీ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీసీసీఐకి ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.. కానీ:
అంతేకాదు మరోసారి ఇలా జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై ప్రస్తుతానికి బీసీసీఐకి ఎలాంటి ఫిర్యాదు చేయలేదు కానీ లీగ్ నిర్వహణకు సంబంధించి బీసీసీఐ ఇచ్చే నివేదికలో మాత్రం దీన్ని చేరుస్తామని అధికారులు తెలిపారు.

బయటి వ్యక్తులు జట్టును కలవకూడదని:
ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చోటు చేసుకున్నప్పటి నుంచి బయటి వ్యక్తులు జట్టును కలవకూడదన్న నిబంధనను మరింత కఠినతరం చేశారు. అప్పటి నుంచి ఆటగాళ్లు పాల్గొనే ఏ ప్రైవేటు కార్యక్రమంలోనైనా బయట వ్యక్తులు హాజరుకాకూడదు.

ఆటగాళ్లు ఇచ్చిన పార్టీ కాదు ఇది
‘ఛీర్ గర్ల్స్‌కు ఆటగాళ్లు ఇచ్చిన పార్టీ కాదు ఇది. వారు వచ్చారు. భోజనం చేశారు. తిరిగి వెళ్లిపోయారు. దీనిపై బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆగ్రహంగా ఉన్నారని తెలిసింది. వెళ్లి వారితో మాట్లాడతాం' అని ఢిల్లీ డేర్‌డెవిల్స్ యాజమాన్యం తెలిపింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications