For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2019: డేర్‌డెవిల్స్ అసిస్టెంట్ కోచ్‌గా కైఫ్

IPL 2019: Delhi Daredevils Appoint Mohammad Kaif As Assistant Coach| Oneindia Telugu
Delhi Daredevils appoint Mohammad Kaif as assistant coach

హైదరాబాద్: ఐపీఎల్‌-2019 సీజన్‌ ప్రారంభానికి మరి కొన్ని నెలలే సమయం ఉండడంతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌.. తమ జట్టును మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన టీమిండియా మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ ప్రఖ్యాత దేశీవాలీ లీగ్ అయిన ఐపీఎల్‌లో దర్శనమివ్వనున్నాడు. మహ్మద్ కైఫ్ ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఫ్రాంచైజీలో భాగం కానున్నాడు.

కైఫ్.. వచ్చే సీజన్లో ఢిల్లీకి సేవలు

కైఫ్.. వచ్చే సీజన్లో ఢిల్లీకి సేవలు

గతంలో గుజరాత్ లయన్స్ కోసం 2017ఐపీఎల్ సీజన్‌లో పని చేసిన కైఫ్.. వచ్చే సీజన్లో ఢిల్లీకి సేవలు అందించనున్నాడు. అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రేతో కలిసి టాలెంట్ స్కౌట్స్‌గా పని చేయనున్నాడు. వీరిద్దరూ కలిసి ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లను వెలుగులోకి తీసుకురానున్నారు. ఐపీఎల్ వేలం ప్రక్రియలో ఢిల్లీకి వీరి సేవలు కీలకం కానున్నాయి.

క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కైఫ్

క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కైఫ్

ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కైఫ్.. భారత్ తరఫున 13 టెస్టులు, 125 వన్డేలు ఆడాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్న జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ జట్టులో మార్పులు చేస్తోంది. రికీ పాంటింగ్‌ను హెడ్ కోచ్‌గా నియమించింది. ఇప్పటి వరకూ ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ నెగ్గలేదు. ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. 2018 సీజన్లో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది.

పేలవ ప్రదర్శన కొనసాగించిన ఢిల్లీ డేర్‌డెవిల్స్

పేలవ ప్రదర్శన కొనసాగించిన ఢిల్లీ డేర్‌డెవిల్స్

దీంతో ఫ్రాంచైజీ పేరు మార్చే దిశగానూ యాజమాన్యం సీరియస్‌గా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్ సీజన్లో జట్టు నాయకత్వ లోపంతో సీజన్ ఆసాంతం పేలవ ప్రదర్శన కొనసాగించింది ఢిల్లీ డేర్‌డెవిల్స్. వరుస వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ గౌతం గంభీర్ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవడం. కైఫ్ గతంలో చత్తీస్‌ఘడ్ మెంటార్‌గా రంజీట్రోఫీ అరంగ్రేట సీజన్‌లో మెరిశాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో కలిసి ప్రయాణించడం నాకెంతో ఆనందాన్నిస్తుంది.

మ్యాచ్‌ను సవ్యంగా నడిపించేందుకు

మ్యాచ్‌ను సవ్యంగా నడిపించేందుకు

జట్టుతో పాటుగా దేశం గర్వించేలా చేసే ఆటగాళ్లతో ప్రయాణించేందుకు సంతోషిస్తున్నా.' మొహమ్మద్ కైఫ్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ డైరక్టర్ ముస్తఫా గౌస్ జట్టులోకి స్వగతించారు. 'కైఫ్ తన అనుభవంతో మ్యాచ్‌ను సవ్యంగా నడిపించేందుకు వినియోగిస్తాడని ఆశిస్తున్నాం. యువ క్రికెటర్లకు మెంటార్‌గా వ్యవహరిస్తూనే జట్టును నడిపించాలని కోరుకుంటున్నా.

Story first published: Friday, November 9, 2018, 16:19 [IST]
Other articles published on Nov 9, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+