Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపియల్ 8:16 కోట్లు పలికిన యువీ, ఎవరికీ పట్టని వేణుగోపాల్ రావు

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపియల్) 8 కోసం క్రికెటర్ల వేల పాటలు సాగుతోంది. యువరాజ్ సింగ్‌ను ఢిల్లీ డేర్ డెవిల్స్ ఫ్రాంచైజ్ 16 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. యువీకి రికార్డు రేటు పలికింది. ఇటీవల కాలంలో దేశీవాళీ క్రికెట్‌లో అతను అద్భుతంగా రాణిచాడు.

అంజిలో మాథ్యూస్‌ను కూడా ఢిల్లీ డేర్ డెవిల్స్ రూ.7.50 కోట్లకు కొనుగోలు చేసింది. మురళీ విజయ్‌ను రూ. 3 కోట్లకు పంజాబ్ ఫ్రాంచైజ్ దక్కించుకుంది. పీటర్సన్‌ను రూ.2 కోట్లకు హైదరాబాద్ ఫ్రాంచైజ్ చేజిక్కించుకుంది.

Delhi dare devils purchase Yuv raj Singh for Rs 16 crores

ఐపియల్ 8వ ఎడిషన్ పోటీలు ఎప్రిల్ 8వ తేదీ నుంచి మే 24వ తేదీ వరకు జరుగుతాయి. సోమవారంనాడు మొత్తం 343 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొంటున్నారు. యువరాజ్ సింగ్‌ను నిరుడు బెంగళూర్ రాయల్ చాలెంచర్స్ ఫ్రాంచైజ్ 14 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఈసారి ఢిల్లీ డేరే డెవిల్స్ రూ.16 కోట్ల రికార్డు ధరకు దక్కించుకుంది.

పీటర్సన్‌ను హైదరాబాద్ సన్‌రైజర్స్ చేజిక్కించుకోవడం పట్ల వివియస్ లక్ష్మణ్, ముత్తయ్య మురళీధర్ ఆనందం వ్యక్తం చేశారు. విలియమ్సన్‌ను హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు 60 లక్,ల రూపాయలకు దక్కించుకుంది.

దినేష్ కార్తిక్‌ను బెంగళూర్ రాయల్ చాలెంజర్స్ ఫ్రాంచైజ్ రూ.10.50 కోట్లకు కొనుగోలు చేసింది. అమిత్ మిశ్రాను ఢిల్లీ డేర్ డెవిల్స్ ఫ్రాంచైజ్ రూ.3.50 కోట్లకు దక్కించుకుంది. కాగా, పించ్3.20 కోట్ల రూపాయలకు ముంబై ఫ్రాంచైజ్‌కు అమ్ముడు పోయాడు.రూ. 10 లక్షల బేస్ ధరతో గల అన్‌క్యాప్డ్ స్పిన్నర్ కరియప్పను కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజ్ రూ.2.4కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అక్షయ్ వాఖరేను ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజ్ రూ.10 లక్షల బేస్ ధరకు తీసుకుంది. డోమ్నిక్ జోసెఫ్ ముత్తుస్వామిని ఢిల్లీ డేర్ డెవిల్స్ రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది.

జలజ్ సక్సేనా రూ.10 లక్షలకు రాయల్ చాలెంజ్ బెంగళూర్‌ జట్టులో, మరో ఆల్ రౌండర్ సుమిత్ నర్వాల్‌ రూ.10లక్షలకు కెకెఆర్‌ జట్టులో చేరారు. కెకెఆర్ ఆదిత్య గర్వాహల్‌ను రూ.25 లక్షలకు తీసుకుంది. నిఖిల్ శంకర్ నాయక్2ను రూ.30 లక్షలకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కొనుగోలు చేసింది. అరుణ్, కార్తిక్, అమిత్ పౌనికర్ అమ్ముడు పోలేదు. సిఎం గౌతమ్‌ను ఢిల్లీ డేర్ డెవిల్స్‌ రూ.20లక్షలకు తీసుకుంది.

అతి పిన్న వయస్కుడైన ఆటగాడు సర్ఫారజ్ నౌషాద్ ఖాన్‌ను రాయల్ చాలెంజర్ బెంగళూర్ రూ.50లక్షలకు సొంతం చేసుకుంది. తిరుమశెట్టి సుమన్ అమ్ముడుపోలేదు. హనుమా విహారీని పది లక్షల రూపాయలకు సన్‌రైజర్స్ జట్టు కొనుగోలు చేసింది. శ్రేయాస్ ఐయర్‌కు ఢిల్లీ డేర్ డెవిల్స్ రూ.2.6 కోట్లు పెట్టింది. ఆంధ్ర ఆటగాడు వేణుగోపాల్ రావును ఎవరు కొనలేదు. ప్రజ్ఝాన్ ఓజాను ముంబై ఇండియన్స్ రూ.50 లక్షల రూపాయలకు కొనుగోలుచేసింది.

పీటర్సన్‌ను హైదరాబాద్ సన్‌రైజర్స్ చేజిక్కించుకోవడం పట్ల వివియస్ లక్ష్మణ్, ముత్తయ్య మురళీధర్ ఆనందం వ్యక్తం చేశారు. విలియమ్సన్‌ను హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు 60 లక్,ల రూపాయలకు దక్కించుకుంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+