
పంత్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్ (31 బంతుల్లో 61; 6 ఫోర్లు, 9 సిక్సర్లు), రిషబ్ పంత్ (43 బంతుల్లో 97) రాణించడంతో మరో 15 బంతులు మిగిలి ఉండగానే 17.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. ఢిల్లీ విజయంలో కీలకపాత్ర పోషించిన పంత్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

97 పరుగుల వద్ద అవుట్
ఐపీఎల్‌లో 97 పరుగుల వద్ద అవుటై తృటిలో సెంచరీ చేసే అవకాశంతో పాటు రిషబ్ పంత్ అరుదైన రికార్డును కోల్పోయాడు. బాసిల్ తంపి బౌలింగ్‌లో కీపర్ దినేశ్ కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తద్వారా ఐపీఎల్‌లో సెంచరీ సాధించిన అత్యంత పిన్నవయస్కుడిగా రికార్డు నెలకొల్పే ఛాన్స్‌ను పంత్ మిస్సయ్యాడు.

ఐపీఎల్‌లో సెంచరీ చేసిన అత్యంత పిన్నవయస్కుడిగా పాండే
ఐపీఎల్‌లో సెంచరీ చేసిన అత్యంత పిన్నవయస్కుడిగా మనీశ్ పాండే పేరిట రికార్డు ఉంది. మనీశ్ పాండే 19 ఏళ్ల వయసులో 2009లో రాయల్ ఛాలెంజర్స్ తరఫున సెంచరీ సాధించాడు. అంతేకాదు ఐపీఎల్‌లో సెంచరీ సాధించిన తొలి భారత ఆటగాడు కూడా మనీష్ పాండే కావడం విశేషం.

మొదటి స్ధానంలో విరాట్ కోహ్లీ
ఇదిలా ఉంటే ఐపీఎల్‌లో తక్కువ పరుగుల తేడాతో సెంచరీ కోల్పోయిన ఆటగాళ్ల జాబితాలో బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ మొదటి స్ధానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ 99 పరుగుల వద్ద అవుట్ కాగా.. రైనా, రహానే రెండు పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకున్నారు.


Click it and Unblock the Notifications











