For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

DC vs KKR: కోల్‌కతా జట్టులోకి స్పిన్నర్.. తుది జట్లు ఇవే..

DC vs KKR: ఐపీఎల్ 2025లో భాగంగా 48వ లీగ్ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్డేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరుగుతోంది. ఢిల్లీ జట్టుకు అక్షర్ పటేల్ నాయకత్వం వహిస్తుండగా, కోల్‌కతా జట్టుకు అజింక్య రహానే నాయకత్వం వహిస్తున్నారు. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ జట్టులో ఎటువంటి మార్పులు జరగలేదు. కానీ కేకేఆర్ తన జట్టులో ఒక మార్పు చేసింది. అనుకుల్ రాయ్ జట్టులో చేర్చబడ్డాడు. ఈ సీజన్ లో ఢిల్లీ జట్టు ఇప్పటివరకు 9 మ్యాచ్‌ల్లో 6 గెలిచి పాయింట్ల పట్టికలో నాల్గవ స్థానంలో ఉంది. కోల్‌కతా కూడా 9 మ్యాచ్‌లు ఆడింది, కానీ 3 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచి ప్రస్తుతం 7వ స్థానంలో ఉంది.

కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్యా రహానే మాట్లాడుతూ.. ఈ మ్యాచ్ లో మా జట్టులో ఒక మార్పు ఉందని.. అనుకుల్ రాయ్ జట్టులోకి వచ్చాడని చెప్పాడు. ఈ వికెట్ పై ఎడమచేతి వాటం స్పిన్నర్ మంచి ఎంపిక అని తాను అనుకుంటున్నట్లు వెల్లడించాడు. మేము మిగిలి ఉన్న మ్యాచ్ లలో ఐదింటికి 5 గెలవాలని.. కానీ అంత సులభమేమీ కాదన్నాడు. ఈ పిచ్ ను రీడ్ చేయడం కష్టమని.. పరిస్థితులకు అనుగుణంగా మారాలన్నాడు. త్వరగా అంచనా వేయాలన్నాడు.

Delhi Capitals Won Toss and Chose Field Against Kolkata Knight Riders

ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ మాట్లాడుతూ.. తాము ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నామన్నారు. మంచు కారణంగా రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేయడం సులభం అవుతుందన్నాడు. తమ జట్టులో మార్పులు ఏం చేయలేదని చెప్పాడు. ఇది స్లో వికెట్ అని తాము అనుకుంటున్నామని, పొడిగా అనిపించదన్నాడు.

తుది జట్లు ఇవే..

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహమానుల్లా గుర్బాజ్(w), సునీల్ నరైన్, అజింక్య రహానె(c), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రోవ్‌మన్ పావెల్, హర్షిత్ రాణా, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తి

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్(w), కరుణ్ నాయర్, KL రాహుల్, అక్షర్ పటేల్(c), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, దుష్మంత చమీర, ముఖేష్ కుమార్

కోల్‌కతా నైట్ రైడర్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్: మనీష్ పాండే, లవ్‌నిత్ సిసోడియా, మయాంక్ మార్కండే, వైభవ్ అరోరా, రమణదీప్ సింగ్

ఢిల్లీ క్యాపిటల్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్: అశుతోష్ శర్మ, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, త్రిపురన విజయ్, సమీర్ రిజ్వి, డోనోవన్ ఫెరీరా

Story first published: Tuesday, April 29, 2025, 19:30 [IST]
Other articles published on Apr 29, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+