Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs DC: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. తుది జట్లు ఇవే..

RCB vs DC: ఐపీఎల్ 2025లో భాగంగా 24వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ప్రస్తుతం రెండు జట్లు పాయింట్ల పట్టికలో టాప్-4లో ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ 6 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. ఆర్సీబీ 6 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఈ సీజన్ లో వరుసగా మూడు మ్యాచ్ లను గెలవడం ద్వారా ఢిల్లీ హ్యాట్రిక్ విజయాలు సాధించింది. అయితే ఆర్సీబీ కూడా తన విజయ పరంపరను కొనసాగించాలని కోరుకుంటోంది.

ఢిల్లీ జట్టులో మార్పు
ఈ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు తన ప్లేయింగ్ ఎలెవన్ లో ఒక మార్పు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్ తిరిగి జట్టులోకి వచ్చాడు. డుప్లెసిస్ సమీర్ రిజ్వి స్థానంలో జట్టులోకి వచ్చాడు. కాగా కేఎల్ రాహుల్ మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేయనున్నారు. అదే సమయంలో, ఆర్సీబీ తన ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు.

Delhi Capitals won the toss and chose to bowl first Against Royal Challengers Bangalore

తుది జట్లు ఇవే..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవ్‌దత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, యష్ దయాల్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంపాక్ట్ సబ్స్: సుయాష్ శర్మ, రసిక్ దార్ సలాం, మనోజ్ భండగే, జాకబ్ బెథెల్, స్వప్నిల్ సింగ్

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): ఫాఫ్ డు ప్లసిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్(కెప్టెన్), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, మోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్

ఢిల్లీ క్యాపిటల్స్ ఇంపాక్ట్ సబ్స్: అభిషేక్ పోరెల్, దర్శన్ నల్కండే, కరుణ్ నాయర్, సమీర్ రిజ్వీ, డోనోవన్ ఫెర్రీరా

ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ హెడ్ టు హెడ్
ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స జట్ల మధ్య ఇప్పటివరకు మొత్తం 31 మ్యాచ్ లు జరిగాయి. వీటిలో ఆర్సీబీ 19 మ్యాచ్ లలో విజయం సాధించగా.. ఢిల్లీ క్యాపిటల్స్ 11 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. 2015 సంవత్సరంలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేయబడింది.

Story first published: Thursday, April 10, 2025, 19:28 [IST]
Other articles published on Apr 10, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+