అగ్రస్థానానికి దూసుకెళ్లిన దిల్లీ క్యాపిటల్స్ - ముంబయి ఓటమి
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2025లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచ్ లో దిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండ్ షోతో అద్భుతంగా ఆడింది. బౌలర్ల సమష్టి కృషి, ఓపెనర్లు మెగ్ లానింగ్, షెఫాలీ వర్మ ఇన్నింగ్స్ తో ముంబయి ఇండియన్స్‌పై 9 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో దిల్లీ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ముంబయి రెండో స్థానంలో నిలిచింది.
124 పరుగుల లక్ష్య ఛేదనలో దిల్లీ క్యాపిటల్స్ 14.3 ఓవర్లలోనే వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 124 పరుగులు చేసి విజయం సాధించింది. కెప్టెన్ మెగ్ లానింగ్ (49 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 60 నాటౌట్), ఓపెనర్ షఫాలీ వర్మ (28 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 43 పరుగులు) మంచి ప్రదర్శన చేశారు.అనంతరం షెఫాలీ ఔటయ్యాక జెమీమా రోడ్రిగ్స్ తో(15 నాటౌట్;) కలిసి మెగ్ లానింగ్ లక్ష్యాన్ని పూర్తి చేసింది. ముంబయి బౌలర్లలో అమన్‌జ్యోత్ కౌర్ ఓ వికెట్ దక్కించుకుంది.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ (16 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 22), హేలీ మాథ్యూస్ (22), సివర్ బ్రంట్ (18), అమేలియా కెర్ (17), అమన్‌జ్యోత్ కౌర్ (17) నామమాత్రపు పరుగులు చేశారు. దిల్లీ బౌలర్లలో జొనాసెన్, మిన్ను మణి తలో 3 వికెట్లు తీయగా.. అన్నాబెల్ సథర్ ల్యాండ్, శిఖా పాండే చెరో వికెట్ దక్కించుకున్నారు. జొనాసెన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. నేడు (మార్చి 1) జరగబోయే మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.
DELHI CAPITALS - TABLE TOPPERS OF WPL 2025. 🔝pic.twitter.com/X702wnrkna
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 28, 2025
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications