Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH దరిద్రాన్ని కొన్న ఢిల్లీ యూటర్న్.. కుర్రాడితో రిప్లేస్‌మెంట్

మరో తొమ్మిది రోజుల్లో ఐపీఎల్ సందడి మొదలుకానుంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది .అయితే ఈ సీజన్‌లో అయినా టైటిల్ కలను సాకరం చేసుకోవాలనుకుంటున్న ఢిల్లీ క్యాపిటల్స్ తమ వ్యూహాలకు మరింత పదునుపెడుతోంది. కెప్టెన్ రిషభ్ పంత్ రీఎంట్రీపై స్పష్టత రావడంతో జట్టుకూర్పుపై దృష్టి సారించింది.

ఈ నేపథ్యంలో హ్యారీ బ్రూక్ గురించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఐపీఎల్ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢిల్లీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. రూ.2 కోట్ల కనీస ధరతో వచ్చిన అతడి కోసం రూ.4 కోట్లు వెచ్చించింది. అయితే హ్యారీ బ్రూక్‌ను తీసుకున్న ఢిల్లీ నిర్ణయంపై విమర్శలు వచ్చాయి.

Delhi Capitals will take Uturn who owns Sunrisers Hyderabad misery

ఎందుకంటే.. గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన హ్యారీ బ్రూక్ పేలవ ప్రదర్శన చేశాడు. అంచనాలు అందుకోలేక విమర్శలపాలయ్యాడు. అతడి కోసం ఎస్‌ఆర్‌హెచ్ ఏకంగా రూ.13.25 కోట్లు ఖర్చు చేసింది. అతడిని భరించలేక వేలానికి ముందు వదులుకుంది.

అయితే హ్యారీ బ్రూక్‌ సామర్థ్యంపై నమ్మకం ఉంచి ఢిల్లీ ఫ్రాంచైజీ అతడిని దక్కించుకుంది. కానీ ఐపీఎల్ 17వ సీజన్‌లో అతడు పాల్గొనడంపై అనిశ్చితి నెలకొంది. దీని గురించి అధికారిక ప్రకటన రానప్పటికీ ఢిల్లీ అతడి స్థానంలో మరో ఆటగాడిని భర్తీ చేయడం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. 21 ఏళ్ల ఆస్ట్రేలియన్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్‌ను జట్టులో చేర్చుకోవాలని భావిస్తుంది.

ఫ్రేజర్ విధ్వంసక బ్యాటర్. భారీ షాట్లను సునాయాసంగా ఆడగలడు. వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో 18 బంతుల్లో 41 పరుగులు చేశాడు. అంతేగాక 29 బంతుల్లో సెంచరీ బాది వైట్ బాల్ క్రికెట్‌‌లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు సాధించాడు. మార్ష్ కప్‌లో సౌత్ ఆస్ట్రేలియా తరఫున ఆడిన ఫ్రేజర్ తస్మనియా జట్టుపై ఈ ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ రికార్డు ఏబీ డివిలియర్స్ (31 బంతులు) పేరిట ఉంది. ఫ్రేజర్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధానకోచ్ రికీ పాంటింగ్ అమితాసక్తి చూపిస్తున్నాడు. ఈ టాప్ ఆర్డర్ బ్యాటర్ రాకతో ఢిల్లీ బ్యాటింగ్ మరింత బలోపేతంగా మారుతుందని అభిప్రాయపడుతున్నాడు.

Story first published: Wednesday, March 13, 2024, 12:48 [IST]
Other articles published on Mar 13, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+