Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023 : అతన్ని కెప్టెన్ చేయడానికి ఢిల్లీ క్యాపిటల్స్ ప్రయత్నం.. త్వరలోనే ప్రకటన?

 Delhi Capitals want David Warner to captain the team

కొన్ని రోజుల క్రితం టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అతను కోలుకోవడానికి 3 నుంచి 6 నెలల సమయం పట్టొచ్చని వైద్యులు అంటున్నారు. దీంతో వచ్చే ఐపీఎల్‌లో అతను ఆడటం అసాధ్యంగా కనిపిస్తోంది. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ కెప్టెన్‌గా ఉన్న పంత్.. ఆడకపోతే అతని స్థానంలో జట్టు పగ్గాలు ఎవరు అందుకుంటారు? అనే ప్రశ్న అభిమానులను పట్టిపీడిస్తోంది.

అతనికే ఓటు?

అతనికే ఓటు?

పంత్ ఈ ఐపీఎల్ ఆడటం అసాధ్యంగా కనిపిస్తున్న తరుణంలో ఢిల్లీ యాజమాన్యం వెటరన్ ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్‌కు జట్టు సారధ్య బాధ్యతలు అప్పగించాలని అనుకుంటోందట. అతనికైతే గతంలో ఐపీఎల్ జట్టుకు కెప్టెన్సీ చేసిన అనుభవం కూడా ఉందని ఆ ఫ్రాంచైజీ భావిస్తోంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సారధిగా వార్నర్ అద్భుతంగా రాణించాడు. ఆ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ కూడా అందించాడు. ఈ నేపథ్యంలోనే మరికొన్ని రోజుల్లో అతన్ని సంప్రదించి, జట్టు బాధ్యతలు తీసుకోవాలని ఢిల్లీ యాజమాన్యం కోరనుందట.

వికెట్ కీపర్ ఎవరు?

వికెట్ కీపర్ ఎవరు?

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో రిషభ్ పంత్ చాలా కీలకమైన ఆటగాడు. కేవలం కెప్టెన్‌గానే కాకుండా మంచి వికెట్ కీపర్‌గా కూడా పంత్ సేవలు అందించాడు. ఇప్పుడు పంత్ లేకపోవడంతో కీపింగ్ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే ప్రశ్న కూడా తలెత్తింది. దేశవాళీల్లో రాణిస్తున్న బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌కు ఈ బాధ్యతలు అప్పగించాలని ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ఆలోచిస్తోందట.

లేదంటే మినీ వేలంలో కొనుగోలు చేసిన ఇంగ్లండ్ వికెట్ కీపర్ ఫిల్ సాల్ట్‌ను ఆడించాలి. అతను ఆడితే మళ్లీ ముస్తాఫిజుర్ రెహ్మాన్, ఆన్రిచ్ నోర్యీల్లో ఒకర్ని పక్కన పెట్టాల్సి వస్తుంది. ఈ కారణంగానే సర్ఫరాజ్ ఖాన్‌కు కీపింగ్ బాధ్యతలు అప్పగించాలని ఆలోచిస్తున్నారట.

 కొత్త కుర్రాడికి చోటు!

కొత్త కుర్రాడికి చోటు!

పంత్ లేకపోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ మిడిల్ ఆర్డర్ బలహీనంగా తయారైంది. అతన్ని ఈ సీజన్ నుంచి ఓపెనర్‌గా పంపుతారని వార్తలు వచ్చినా.. ఇప్పటి వరకైతే ఢిల్లీ క్యాపిటల్స్ మిడిలార్డర్‌ భారాన్ని పంత్ మోశాడు. ఇప్పుడు అతను లేకపోవడంతో టీమిండియా అండర్-19 ప్రపంచకప్ విజేత యశ్ ధుల్‌కు జట్టులో ఆడే అవకాశం లభించొచ్చు.

అతను కూడా జట్టులో చేరితే మిడిల్ ఆర్డర్ బలంగా మారుతుందని ఆ ఫ్రాంచైజీ భావిస్తోంది. అయితే అతన్ని ఆడిస్తారా? లేక వేరే ప్రత్యామ్నాయాలను తీసుకుంటారా? అనేది తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.

Story first published: Thursday, January 5, 2023, 12:05 [IST]
Other articles published on Jan 5, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+