Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గంగూలీ ఆశలు ఆవిరి.. షాకిచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్!

ఢిల్లీ క్యాపిటల్స్‌కు కోచ్‌గా బాధ్యతలు అందుకోవాలనుకుంటున్న సౌరవ్ గంగూలీ ఆశలు నెరవేరేలా కనిపించట్లేదు. కోచ్‌గా గంగూలీని నియమించాలని ఢిల్లీ ఫ్రాంచైజీ భావించట్లేదని తెలుస్తోంది. దూకుడైన నిర్ణయాలతో జట్టును పరుగులు పెట్టించే కోచ్ కోసం ఫ్రాంచైజీ వెతుకుతోందని సమాచారం. అంతేగాక దాదాను పక్కనపెట్టడానికి మరో కారణం ఉందని ఫ్రాంచైజీ వర్గాలు పేర్కొన్నాయి.

దిగ్గజ ప్లేయర్ రికీ పాంటింగ్‌‌పై ఢిల్లీ క్యాపిటల్స్ వేటు వేసిన విషయం తెలిసిందే. ప్రధాన కోచ్ బాధ్యతల నుంచి తప్పించింది. ఏడేళ్లుగా కోచ్ పదవిలో కొనసాగుతున్న పాంటింగ్ జట్టుకు టైటిల్ అందించలేకపోయాడు. గత మూడు సీజన్లలో ఢిల్లీని ప్లేఆఫ్స్‌కు కూడా చేర్చలేకపోయాడు. దీంతో పాంటింగ్‌తో ఉన్న కాంట్రాక్ట్‌కు ఫ్రాంచైజీ ముగింపు పలికింది.

Delhi Capitals Unlikely to Name Sourav Ganguly as Head Coach

2018లో పాంటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ గూటికి చేరుకున్నాడు. ఆదిలో తన మార్క్‌ను చూపించాడు. 2019 నుంచి వరుసగా మూడు సీజన్లలో జట్టును ప్లేఆఫ్స్‌‌కు చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. 2020లో ఢిల్లీని ఫైనల్‌‌కు కూడా చేర్చాడు. కానీ టైటిల్ పోరులో తడబడి ఢిల్లీ ట్రోఫీని కోల్పోయింది. ఆ తర్వాత జట్టు వరుసగా పేలవ ప్రదర్శన చేస్తోంది.

అయితే పాంటింగ్ తప్పిస్తున్నట్లు ఫ్రాంచైజీ ప్రకటించకముందే ఆ జట్టు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ సౌరవ్ గంగూలీ మీడియాకు తెలిపాడు. అంతేగాక కోచ్ బాధ్యతలను తాను అందుకోవడానికి ఆసక్తిగా ఉన్నానని గంగూలీ పేర్కొన్నాడు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీతో చెబుతానని, కోచ్‌గా ఎంపికైన తర్వాత జట్టు ప్రదర్శన ఎలా ఉంటుందో మీరే చూస్తారని అన్నాడు. కాగా, గంగూలీని కోచ్‌గా ఎంపిక చేయడానికి ఫ్రాంచైజీ ఆసక్తితో లేదు.

''ప్రస్తుతం డైరెక్టర్ ఆఫ్ క్రికెటర్‌గా గంగూలీ ఇప్పటికే ప్రధాన బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఫ్రాంచైజీతో ఎన్నో పనులు కొనసాగిస్తున్నాడు. అయితే జట్టును దూకుడుగా సిద్ధం చేసే గౌతమ్ గంభీర్ వంటి కోచ్ కోసం ఫ్రాంచైజీ అన్వేషిస్తోంది. అతను మెంటార్‌గా సక్సెస్ అయ్యాడు. అంతర్జాతీయ, దేశవాళీ ప్లేయర్లను ట్రాక్ చేస్తూ ఉంటాడు. వచ్చే సీజన్ ముంగిట మెగావేలం ఉండటంతో ఎవరినైనా తాత్కాలికంగా నియమించాలని ఫ్రాంచైజీ భావించట్లేదు. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలనుకుంటుంది'' అని ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి.

Story first published: Tuesday, July 16, 2024, 15:56 [IST]
Other articles published on Jul 16, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+