Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 2019: కుమార సంగక్కర రికార్డు బద్దలు కొట్టిన రిషబ్ పంత్

IPL 2019 : Rishabh Pant Surpasses Kumar Sangakkara To Set New IPL Record || Oneindia Telugu
Delhi Capitals star Rishabh Pant surpasses Kumar Sangakkara to set new IPL record

హైదరాబాద్: ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటిల్స్ యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ సరికొత్త రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ సీజన్‌లో 20 ఔట్లలో భాగస్వామి అయిన మొట్టమొదటి వికెట్ కీపర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర రికార్డుని పంత్ బద్దలు కొట్టాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

రెండు క్యాచ్‌లు పట్టడంతో అరుదైన ఘనత

రెండు క్యాచ్‌లు పట్టడంతో అరుదైన ఘనత

టోర్నీలో భాగంగా ఆదివారం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రిషబ్‌ పంత్ రెండు క్యాచ్‌లు పట్టడంతో ఈ ఘనత సాధించాడు. ఈ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన పంత్‌ 15 క్యాచ్‌లు పట్టి, 5 స్టంపింగ్‌లు చేశాడు. 2011లో డెక్కన్‌ చార్జర్స్‌ జట్టు తరపున ఆడిన కుమార సంగక్కర 19 ఔట్లలో భాగస్వామి అయ్యాడు.

ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో

ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో

ఫిరోజ్‌షా కోట్లా వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో రిషబ్‌ పంత్‌ రెండు అద్భుతమైన క్యాచ్‌లు అందుకుని జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో పంత్ 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద చైనామన్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో పంత్... క్లాసెన్‌, గురుకీరత్‌ సింగ్‌లను పెవిలియన్‌కు పంపాడు.

పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో

పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో

ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. తద్వారా ఏడేళ్ల తర్వాత ప్లేఆఫ్‌కు చేరుకుంది. కాగా, గత సీజన్‌లో పంత్ అత్యధిక పరుగులు చేసిన వికెట్‌ కీపర్‌(684)గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన బీపీఎల్ 2019లో బంగ్లా వికెట్‌ కీపర్‌ నురుల్ హసన్‌ కూడా 19 ఔట్లలో భాగస్వామి అయ్యాడు.

Story first published: Monday, April 29, 2019, 15:58 [IST]
Other articles published on Apr 29, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+