Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022 Final : ఢిల్లీకి ప్లేయరైనా దిల్‌లో మాత్రం రాజస్థానే, వైరలైన చేతన్ సకారియా పిక్ ఎందుకంటే?

Delhi Capitals player Chetan sakaria wears RR jersey and attends the final match at the stands in support of RR

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ చరిత్రలో రాజస్థాన్ రాయల్స్ 2008లో ప్రారంభ సీజన్ తర్వాత 2022 సీజన్లో ఫైనల్‌కు చేరుకుంది. ఇకపోతే 2008లో ఆస్ట్రేలియా దిగ్గజ ప్లేయర్ దివంగత గ్రేట్ షేన్ వార్న్ రాజస్థాన్ రాయల్స్‌కు టైటిల్ అందించగా.. ఈసారి మాత్రం రాజస్థాన్ రాయల్స్.. టైటిల్ చేజార్చుకుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్ కోసం రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ కొందరు మాజీ ప్లేయర్లను ఆహ్వానించింది. 2008ఎడిషన్ టోర్నమెంట్‌ను గెలుచుకున్న జట్టులో సభ్యులుగా ఉన్న ఎనిమిది మందిని ఫ్రాంఛైజీ ఆహ్వానించింది. మహమ్మద్ కైఫ్, యూసుఫ్ పఠాన్, మునాఫ్ పటేల్ తదితర ఆటగాళ్లకు రాయల్స్ ఫ్రాంఛైజీ ఆహ్వానం అందింది.

అయితే ఆ జట్టు తరఫున ఆడిన మాజీ క్రికెటర్లే కాకుండా ప్రస్తుత క్రికెటర్ అయినా చేతన్ సకారియా కూడా మ్యాచ్ చూడ్డానికి స్టేడియానికి వచ్చాడు. అతనికి ఆహ్వానం అందిందో లేదో తెలియదు కానీ.. అతను ప్రేక్షకుల్లో ఒకరిగా రాజస్థాన్ రాయల్స్ జెర్సీ ధరించి స్టాండ్స్ లో కూర్చుని మ్యాచ్ వీక్షించాడు. ఈ ఏడాది వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పేసర్ చేతన్ సకారియాను కొనుగోలు చేసింది. కేవలం ఈ సీజన్లో సకారియా మూడు మ్యాచ్‌‌లు మాత్రమే ఆడాడు. అంతకుముందు సీజన్లో చేతన్ సకారియా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు. ఇక ఫైనల్ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ జెర్సీని ధరించి సకారియా హాజరు అయిన ఫోటో నెట్టింట్లో వైరలైంది.

ఇకపోతే సకారియా 2021 ఎడిషన్‌లో 14మ్యాచ్‌ల్లో రాయల్స్‌ తరఫున ఆడి మెరుగైన ప్రదర్శన చేశాడు. 14 మ్యాచుల్లో 8ఎకానమీతో 14వికెట్లు తీశాడు. ఆర్ఆర్ తరఫున అతని ఆటను చూసే అప్పట్లో శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో అతన్ని సైడ్ సెకండ్-స్ట్రింగ్ స్క్వాడ్‌ కు బీసీసీఐ ఎంపిక చేసింది. తద్వారా టీమిండియా తరఫున ఆడాలన్న తన కల నేరవేరింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడినందునే తన కల నెరవేరిందనే అభిమానం చేతన్ సకారియాకు ఆ జట్టుపై ఎంతో ఉంది. అందుకే ఢిల్లీ జట్టుకు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నా.. రాజస్థాన్ రాయల్స్ జట్టు జెర్సీ ధరించి రాజస్థాన్ కోసం సపోర్ట్ గా జెర్సీ ధరించి మరీ వచ్చాడు.

Story first published: Monday, May 30, 2022, 16:35 [IST]
Other articles published on May 30, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+