Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఢిల్లీకి సన్‌రైజర్స్ దరిద్రం..ఎంతకి కొన్నారంటే?

ఐపీఎల్ 2024 వేలం ప్రారంభమైంది. ఆటగాళ్ల కోసం ఫ్రాంఛైజీలు పోటాపోటీ పడుతున్నాయి.వెస్టిండీస్ బ్యాటర్ రొవ్‌మెన్ పావెల్‌తో ఆక్షన్ ప్రారంభమైంది. పావెల్ కోసం రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ పోటాపోటీపడ్డాయి. కనీస ధర రూ.కోటిగా బరిలోకి దిగిన పావెల్‌ను రూ.7.40 లక్షలకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది.

తర్వాత వచ్చిన దక్షిణాఫ్రికా ప్లేయర్ రొసొవ్‌ను ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. అయితే సన్‌‌రైజర్స్‌ను వదులుకున్న హ్యారీ బ్రూక్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ పోటీపడ్డాయి. గత సీజన్‌ కోసం హ్యారీ బ్రూక్‌ను హైదరాబాద్ ఏకంగా రూ.13.25 కోట్లు వెచ్చించిన సంగతి తెలిసిందే. కానీ ఆ సీజన్‌లో అంచనాలను అందుకోలేక పేలవ ప్రదర్శన చేశాడు.

Delhi Capitals pick up Harry Brook player who was dropped by Sunrisers Hyderabad

అయితే కనీస ధర రూ.2 కోట్లతో వేలంలో బరిలోకి దిగిన బ్రూక్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.4 కోట్లకు దక్కించుకుంది.వేలంలో సీనియర్ ప్లేయర్లు మనీష్ పాండే, స్టీవ్ స్మిత్‌పై ఏ ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు. మనీష్ పాండే కోసం పోటీ ఉంటదని అందరూ భావించారు. కానీ ఫలితం మరోలా వచ్చింది. అయితే హైదరాబాద్ ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్‌ను రూ.6.8 కోట్లకు తీసుకుంది.

ఈ నేపథ్యంలో వేలం గురించి నెటిజన్లు కామెంట్లు మొదలుపెట్టారు. హెడ్‌ను కొనుగోలు చేయడం సన్‌రైజర్స్ మంచి నిర్ణయమని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు హైదరాబాద్ దరిద్రాన్ని ఢిల్లీ కొనుగోలు చేసిందని కామెంట్లు చేస్తున్నారు. కాగా,వేలానికి ముందు ఎస్ఆర్‌హెచ్ దగ్గర రూ. 34 కోట్లు ఉండగా, హెడ్‌ను కొనుగోలు చేయడంతో పర్స్ వాల్యూ రూ. 27.2 కోట్లకు చేరింది.

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టులో 12 ఖాళీలు ఉన్నాయి. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ లో 8 ఖాళీలు; ఇక గుజరాత్ టైటాన్స్, ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలో 8 ఖాళీలు, రాజస్థాన్ రాయల్స్ 7 ఖాళీలు ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లలో ఆరు ఖాళీలు; సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కు అయిదు ఖాళీలు ఉన్నాయి.

Story first published: Tuesday, December 19, 2023, 14:03 [IST]
Other articles published on Dec 19, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+