Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

LSG vs DC: చెల‌రేగిన పృథ్వీ షా.. ధాటిగా ఆడ‌ని పంత్, స‌ర్ఫ‌రాజ్‌.. ల‌క్నో ముందు మోస్త‌రు ల‌క్ష్యం

Delhi Capitals opner Pruthvi shaw (61) Half Century and Lucknow supergiants Target 150 runs

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ముందు ఢిల్లీ క్యాపిట‌ల్స్ 150 ప‌రుగుల మోస్త‌రు ల‌క్ష్యాన్ని ఉంచింది. ఆరంభంలో ఢిల్లీ ఓపెన‌ర్ పృథ్వీ షా సూప‌ర్ హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగ‌డంతో ఓ ద‌శ‌లో ఆ జ‌ట్టు భారీ స్కోర్ సాధించేలా క‌నిపించింది. కానీ షా ఔట‌య్యాక ఢిల్లీ ఇన్నింగ్స్‌ను ధాటిగా న‌డిపించేవారే క‌రువయ్యారు.
కెప్టెన్ రిష‌బ్ పంత్, స‌ర్ప‌రాజ్ ఖాన్ నాల్గో వికెట్‌కు అజేయంగా 75 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెలకొల్పిన‌ప్ప‌టికీ ధాటిగా ఆడ‌లేక‌పోయారు. ల‌క్నో బౌల‌ర్లు ఆవేష్ ఖాన్‌, జేస‌న్ హోల్డ‌ర్ అద్భుతంగా బౌలింగ్ చేయ‌డంతో చివ‌రి 3 ఓవ‌ర్ల‌లో 19 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగారు.

 అద‌ర‌గొట్టిన పృథ్వీ షా

అద‌ర‌గొట్టిన పృథ్వీ షా

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు ఓపెన‌ర్లు పృథ్వీ షా, డేవిడ్ వార్న‌ర్ శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 7.3 ఓవ‌ర్ల‌లో 67 ప‌రుగులు జోడించారు. ఇందులో పృథ్వీ షానే 61 ప‌రుగులు చేయ‌డం గ‌మ‌నార్హం. మొద‌టి నుంచి ధాటిగా ఆడిన షా.. దాదాపు స్ట్రైకింగ్‌లో తానే ఉన్నాడు. ఈ క్ర‌మంలో ఆవేష్ ఖాన్ వేసిన నాల్గో ఓవ‌ర్లో హ్యాట్రిక్ ఫోర్లు కూడా బాదాడు. అనంత‌రం 30 బంతుల్లో ఐపీఎల్ కెరీర్లో 11వ హాఫ్ సెంచ‌రీ చేశాడు. అయితే కృష్ణ‌ప్ప గౌతం వేసిన ఎనిమిదో ఓవ‌ర్లో వికెట్ కీప‌ర్ క్వింట‌న్ డికాక్‌కు క్యాచ్ ఇచ్చి పృథ్వీషా (61 ర‌న్స్‌.. 9 ఫోర్లు, 2 సిక్సులు) ఔట‌య్యాడు.

 74 ర‌న్స్‌కు 3 వికెట్లు

74 ర‌న్స్‌కు 3 వికెట్లు

ఆ త‌ర్వాత డేవిడ్ వార్న‌ర్ (4), రోవ్మాన్ పావెల్ (3) విఫ‌ల‌మ‌వ‌డంతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ 74 ప‌రుగుల‌కే 3 వికెట్లు కోల్పోయింది. వీరిద్ద‌రిని ర‌వి బిష్ణోయ్ ఫెమిలియ‌న్ చేర్చాడు. ఈ క్ర‌మంలో కెప్టెన్ రిష‌బ్ పంత్, స‌ర్ప‌రాజ్‌ఖాన్ ఢిల్లీని ఆదుకున్నారు. వీరిద్ద‌రు నాల్గో వికెట్‌కు 75 ప‌రుగులు జోడించారు. కానీ ధాటిగా ఆడ‌లేక‌పోవడంతో ఢిల్లీ భారీ స్కోర్ సాధించేలేక‌పోయింది. వీరిద్ద‌రు 57 బంతుల్లో 75 ప‌రుగులు మాత్ర‌మే చేశారు.

చివ‌రి 3 ఓవ‌ర్ల‌లో 19 ర‌న్సే

చివ‌రి 3 ఓవ‌ర్ల‌లో 19 ర‌న్సే

చివ‌ర్లో 3 ఓవ‌ర్ల‌లో ల‌క్నో బౌల‌ర్లు ఆవేష్ ఖాన్, జేస‌న్ హోల్డ‌ర్ 19 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చారు. దీంతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల న‌ష్టానికి 149 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. ఇక రిష‌బ్ పంత్ (36 బంతుల్లో 39 ర‌న్స్‌.. 3 ఫోర్లు, 2 సిక్సులు), స‌ర్ఫ‌రాజ్ ఖాన్ (28 బంతుల్లో 36 ర‌న్స్‌.. 3 ఫోర్లు) నాటౌట్‌గా నిలిచారు. లక్నో బౌల‌ర్ల‌లో ర‌వి బిష్ణోయ్ 2, కృష్ణ‌ప్ప గౌతం ఒక వికెట్ తీశారు.

తుది జ‌ట్లు

తుది జ‌ట్లు

ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, రిషబ్ పంత్ (వికెట్ కీప‌ర్/ కెప్టెన్‌), రోవ్‌మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్, అన్రిచ్ నార్టే

లక్నో సూపర్ జెయింట్స్: కెఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీప‌ర్), ఎవిన్ లూయిస్, దీపక్ హుడా, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, జాసన్ హోల్డర్, కృష్ణప్ప గౌతమ్, ఆండ్రూ టై, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్.

Story first published: Thursday, April 7, 2022, 21:34 [IST]
Other articles published on Apr 7, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+