Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ లో టాప్ 5 లోయెస్ట్ పవర్ ప్లే స్కోర్స్.. వరస్ట్ లోకెల్లా వరస్ట్ !!

ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ తన విజయాల పరంపరను కొనసాగిస్తోంది. సోమవారం రాత్రి ఢిల్లీలో ఢిల్లీ కేపిటల్స్ తో జరిగిన మ్యాచ్‌లో తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ స్కోర్ ను అలవోకగా అందుకుంది. 81 బంతులు మిగిలి ఉండగానే దీన్ని ఛేదించింది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే రెండో అతిపెద్ద విజయం. ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్ లల్లో ఆరింట్లో నెగ్గింది ఆర్సీబీ. మొత్తం 12 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.

ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ కేపిటల్స్ 16.3 ఓవర్లలో 75 పరుగులకు ఆలౌటైంది. ఇంపాక్ట్ ప్లేయర్ అభిషేక్ పోరెల్ ఒక్కడే టాప్ స్కోరర్. 33 బంతుల్లో 3 ఫోర్లతో 30 పరుగులు చేశాడు. అర్‌సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ (3/5), జోష్ హేజిల్‌వుడ్ (4/12) ఢిల్లీ క్యాపిటల్స్ పతనాన్ని శాసించారు. కృనాల్ పాండ్యా, సుయాష్ శర్మ, రసిక్‌ధర్ సలామ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

Delhi Capitals Mega Collapse as the team Writhes Through One of IPL Worst Powerplays En Route to 75

ఢిల్లీ క్యాపిటల్స్ పవర్ ప్లేలో ఆరు వికెట్లు కోల్పోయి పేలవమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరచడం ఈ ఓటమికి ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో ఐపీఎల్ చరిత్రలో నమోదైన అయిదు అత్యల్ప పవర్ ప్లే స్కోర్లపై ఓ లుక్ వేద్దాం.

ఐపీఎల్ చరిత్రలో నమోదైన అత్యల్ప పవర్ ప్లే స్కోరు 16/1. 2015లో రాయ్‌పూర్‌లో జరిగిన మ్యాచ్‌లో అప్పటి ఢిల్లీ డేర్‌డెవిల్స్ పై లోయెస్ట్ పవర్ ప్లే స్కోర్ అందుకుంది చెన్నై సూపర్ కింగ్స్. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సీఎస్కే పవర్ ప్లేలో 16 పరుగులు మాత్రమే చేయగలిగింది. 20 ఓవర్లలో 119 పరుగులు చేసిందా మ్యాచ్ లో.

మరో అత్యల్ప పవర్ ప్లే స్కోర్ 15/2. ఈడెన్ గార్డెన్స్ లో కోల్ కత నైట్ రైడర్స్ మరోసారి లోయెస్ట్ పవర్ ప్లే స్కోర్ చేసింది చెన్నై సూపర్ కింగ్స్. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న సీఎస్కే పవర్ ప్లేలో ఒక్క బౌండరీ కూడా కొట్టలేక 15 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయి ఇబ్బందులు పడింది. ఆ మ్యాచ్ లో చెన్నై 20 ఓవర్లలో 114/4 పరుగులు మాత్రమే చేసింది.

మూడో అత్యల్ప పవర్ ప్లే స్కోరు సన్ రైజర్స్ హైదరాబాద్ ది. 2022లో పుణెలో జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లల్లో 210/6 భారీ స్కోరును నమోదు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ పవర్ ప్లేలో 3 వికెట్లు కోల్పోయి 14 పరుగులు మాత్రమే చేసి ఘోరమైన ఆరంభం చవిచూసింది.

ఐపీఎల్ చరిత్రలో నమోదైన రెండవ అత్యల్ప పవర్ ప్లే స్కోరు 14/2. కేప్‌టౌన్‌లో 2009లో రాయల్ ఛాలెంజర్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చెత్త రికార్డు నెలకొల్పింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లల్లో 133/8 పరుగులు చేసింది. 134 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన రాజస్థాన్, ఆరంభంలో మందకొడిగా ఆడుతూ మొదటి ఆరు ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే చేసి రెండు వికెట్లు కోల్పోయింది.

ఐపీఎల్ చరిత్రలో నమోదైన అత్యల్ప పవర్ ప్లే స్కోరు 13/6. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఏకంగా ఆరు వికెట్లను కోల్పోయి 13 పరుగలు మాత్రమే చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. తొలి నాలుగు ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయింది. పవర్ ప్లే ముగిసేసరికి ఢిల్లీ 13 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి ఘోర పరాజయం దిశగా అడుగులు వేసింది.

Story first published: Tuesday, April 28, 2026, 15:10 [IST]
Other articles published on Apr 28, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+