
రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌ను కరోనా దెబ్బకొట్టింది. కరోనా వల్ల ఢిల్లీ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ ఈ మ్యాచ్‌కు జట్టుతో పాటు అందుబాటులో లేకుండాపోయాడు. హోటల్‌లో అతనితో పాటు బస చేసిన అతని కుటుంబసభ్యులలో ఒకరికి కోవిడ్-19 పాజిటివ్ రావడంతో అతను ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఢిల్లీ టీంలో కోవిడ్ కేసులు వెలుగుచూడడంతో ఢిల్లీ వర్సెస్ ఆర్‌ఆర్ మ్యాచ్ వేదికను పూణెలోని ఎంసీఏ స్టేడియం నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియానికి బీసీసీఐ మార్చింది.
ఇప్పటికే ఢిల్లీ ప్లేయర్లు టిమ్ సీఫెర్ట్, మిచెల్ మార్ష్ సహా టీం సిబ్బందితో కలిపి ఆరుగురు సభ్యులు కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. వైరస్ బారిన పడిన తర్వాత మొత్తం ఢిల్లీ క్యాంపులో రెగ్యులర్‌గా ఆర్టీ పీసీఆర్ టెస్టింగ్ జరుగుతోంది. ఢిల్లీ ప్లేయర్లు, టీం సహాయక సిబ్బంది వారితో పాటు ఉన్న కుటుంబసభ్యులకు గురువారం, శుక్రవారం కోవిడ్ పరీక్షలు నిర్వహించారు.
ఈ టెస్టుల్లో రికీ పాంటింగ్‌కి రెండు సార్లు నెగెటివ్ అని తేలింది. కానీ అతని కుటుంబ సభ్యులలో ఒకరికి పాజిటివ్ అని తేలడంతో రికీ పాంటింగ్, అతని కుటుంబం ముందు జాగ్రత్త చర్యగా క్వారంటైన్‌లోకి వెళ్లింది. పాంటింగ్ ఐదు రోజుల పాటు క్వారంటైన్‌లో గడపనున్నాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ కుటుంబసభ్యుల్లో ఒకరికి కోవిడ్ సోకిన విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ టీం మేనేజ్‌మెంట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సమయంలో రికీ పాంటింగ్, అతని కుటుంబసభ్యుల గోప్యతను గౌరవించాలని అభిమానులను కోరింది. అలాగే ఢిల్లీ క్యాంపులో ఉన్న ప్రతి ఒక్కరికి రెగ్యులర్‌గా కోవిడ్ టెస్టులు నిర్వహిస్తున్నామని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, కరోనా సోకిన టీం సభ్యులు తొందరగా కోలుకునేలా చర్యలు చేపడుతున్నట్లు టీం మేనేజ్‌మెంట్ తెలిపింది.